ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ , కడుపుబ్బా నవ్వించే శకలక శంకర్ , ధనరాజ్ కామెడీ , జ్ఞానం సినిమాటోగ్రఫీ , సాహి సురేష్ ఆర్ట్ వర్క్ , సాయి కార్తీక్ రీ రికార్డింగ్ , రాధాకృష్ణ ఆడియోగ్రఫీఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ , ఫస్ట్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ , కడుపుబ్బా నవ్వించే శకలక శంకర్ , ధనరాజ్ కామెడీ , జ్ఞానం సినిమాటోగ్రఫీ , సాహి సురేష్ ఆర్ట్ వర్క్ , సాయి కార్తీక్ రీ రికార్డింగ్ , రాధాకృష్ణ ఆడియోగ్రఫీబోరింగ్ సెకండాఫ్ , ఊహాజనితంగా తయారైన సస్పెన్స్ , సాగదీసిన కథనం , సెకండాఫ్ స్లో నేరేషన్ , క్లైమాక్స్ లో లింక్స్ లేకపోవడం , సెకండాఫ్ ఎడిటింగ్ , మెయిన్ రోల్స్ చేసిన నటీనటుల పెర్ఫార్మన్స్ చెత్తగా ఉండడం.

ఇప్పటి వరకూ వచ్చిన చాలా హర్రర్ కామెడీల ఫార్మాట్ లోనే ఈ సినిమా కూడా ఉంటుంది.. ఇక అసలు కథలోకి వెళితే.. నందిగామ అనే గ్రామంలో ఓ రాజ మహాల్ ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలని వెళ్ళిన 34 మంది చనిపోతారు. దాంతో ఆ రాజమహల్ ని ప్రభుత్వం సీజ్ చేస్తుంది. కట్ చేస్తే 6 నెలలకి మా టీవీ వారు అదే రాజమహల్ పై 'దెయ్యాన్ని 7 రోజుల్లో పట్టుకుంటే 3 కోట్లు' అనే రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు. దీనికోసం ఆడిషన్స్ ని కండక్ట్ చేసి ఏడుగురిని సెలక్ట్ చేస్తారు. వారే అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్). అక్కడికి వెళ్ళిన వీరికి మొదటి రెండు రోజుల్లోనే కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొంటారు. దాంతో వాళ్ళు అక్కడ దెయ్యం ఉందని భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే అశ్విన్ అక్కడ జరుగుతున్న అనర్ధాల వెనకున్న చిదంబర రహస్యం ఏంటనేది చేదిస్తాడు. ఆ రహస్యం ఏంటి.? దెయ్యం ఉందా.? లేదా.? అన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి థ్రిల్ ఫీలవ్వాల్సిందే..  


రాజుగారి గది అని సినిమాలో ఉన్న నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. కీ రోల్ చేసిన రాజీవ కనకాల గురించి. సినిమాని మలుపు తిప్పే పాత్రలో రాజీవ్ కనకాల సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రాజీవ్ కనకాల తర్వాత సినిమాని తమ భుజాల మీద వేసుకొని నడిపించినవారు ఇద్దరు.. వల్లే ధనరాజ్ అండ్ శకలక శంకర్. శివుడు అండ్ మైదానంగా వీరిద్దరూ చేసిన కామెడీ ఆడియన్స్ ని పిచ్చపిచ్చగా నవ్విస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళు లేకపోతే సినిమా పెద్ద గుండు సున్నా అయ్యేది. ఇకపోతే సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన అశ్విన్ ఓంకార్, పవిత్ర లోకేష్, చేతన్ చీను, రఘుబాబు, విద్యుల్లేక, అప్పారావు, ప్రభాస్ శీనులు వరస్ట్ అనిపించలేదు గానీ ఉన్ననంతలో  ఓకే అనిపించేనతలా చేసారు. చెప్పాలంటే చేతన్ చీను నెగటివ్ యాంగిల్ సినిమాలో అక్కడక్కడా ఓవర్ డోస్ అనిపిస్తుంది. ధన్య బాలకృష్ణకి ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్ర లేదు, పెర్ఫార్మన్స్ చేస్తున్న  స్కోప్ కూడా  లేదు..  సో ఈ క్యారెక్టర్ లైట్.. ఈశాన్య అనే ఇంకో హీరోయిన్ సినిమాకి జస్ట్ ఒక గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే.. ఇక సినిమాకి కీలకం అవ్వాల్సిన పూర్ణ, పోసాని కృష్ణమురళిల పాత్ర డిజైనింగ్   చాలా చెత్తగా ఉంది, ఇక దానిని అంతకన్నా దారుణంగా ప్రెజంట్ చేసారు. కావున వీరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. 

మొదటి సినిమా జీనియస్ తో సీరియస్ ఇష్యూని డీల్ చేసిన ఓంకార్ తన రెండవ సినిమాకి మాత్రం మాంచి ఎంటర్టైనింగ్ గా ఉన్న కథ చెప్పాలనుకొని ఇప్పటి టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా హర్రర్ కామెడీ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ జానర్ కోసం సోషల్ మెసేజ్ ఉన్న ఓ మంచి స్టొరీ లైన్ ని కూడా అనుకున్నాడు. అనుకున్న కథలో సగభాగం బాగా రాసుకున్న ఓంకార్ సెకండాఫ్ విషయంలో కాస్త తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ పరంగా కామెడీ,సస్పెన్స్ అనే అంశాలను బాగానే మిక్స్ చేసుకుంటూ వచ్చాడు, కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి సస్పెన్స్ అనే దాన్ని మర్చిపోయాడు, దాంతో బలవంతంగా ఇరికించి మరీ సెకండాఫ్ లో కామెడీ పెట్టాల్సి వచ్చింది. దాంతో సస్పెన్స్ మరియు ఉన్న ట్విస్ట్ ని గాలికొదిలేసాడు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో కథ అనేది అస్సలు మొదలు కాదు.. కానీ ఆడియన్స్ మాత్రం సంబంధం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తారు.. కానీ సెకండాఫ్ లో మాత్రం ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలనే తపనలో పడి దేన్నీ సరిగా డీల్ చెయ్యలేదు, అటు నవ్వించలేదు, ఇటు భయపెట్టలేదు.. పోనీ ఫైనల్ ట్విస్ట్ తో అన్నా సర్ప్రైజ్ చేసాడా అంటే అదీ లేదు. ఓంకార్ జీ ఫస్ట్ హాఫ్ ని అంతబాగా రాసుకొని సెకండాఫ్ ని ఎందుకంతలా దొబ్బెట్టారు.. ఆ హౌ అని.? కథలో  ఊహించలేని కంటెంట్ అయితే లేదు. కానీ కథనంలో ఆ సస్పెన్స్ ని చాలా ఆసక్తికరంగా రివీల్ చేసే చాన్స్ ఉన్నా ఓంకార్ మాత్రం అందరిలా రెగ్యులర్ ఫార్మాట్ నే ఫాలో అవ్వడం సినిమాకి పెద్ద మైనస్. అలాగే సెకండాఫ్ లో నేరేషన్ కూడా చాలా స్లోగా ఉండడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. కనీసం ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీని కూడా సెకండాఫ్ లో చూపలేకపోవడం ఓంకార్ చేసిన బిగ్గెస్ట్ మైనస్. సెకండాఫ్ లో ఫెయిల్ అవ్వడం వలన ఒక డైరెక్టర్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు ఓంకార్. అలాగే సినిమాలో చాలా లాజిక్స్ వదిలేసాడు. ఓంకార్ ఈ సినిమాలో చూపిన కొత్తదనం ఏంటి అంటే.. ఇప్పటివరకూ దెయ్యాల కథలనే ఎక్కువగా హర్రర్ కామెడీగా చెప్పడానికి ట్రై చేసారు. కానీ దెయ్యం లేని సస్పెన్స్ థ్రిల్లర్ కథని హర్రర్ కామెడీగా చెప్పడం ఈ సినిమాలోనే చూడచ్చు. మొత్తంగా ఓంకార్ సోషల్ మెసేజ్ ఉన్న స్టొరీ లైన్ ని ఈ సినిమాకి ఎంచుకోవడం అభినందనీయం.  

ఇక టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే... ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ఆర్ట్ వర్క్ సింప్లీ సూపర్బ్.. 3 కోట్ల సినిమాకి తను డిజైన్ చేసే సెట్స్ మాత్రం సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ఆ ఆర్ట్ వర్క్ ని సినిమాటోగ్రాఫర్ జ్ఞానం ప్రెజంట్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్. ఒక హర్రర్ కామెడీ సినిమాకి ఎలాంటి విజువల్స్ ఇస్తే బెస్ట్ అవుతుందో అలాంటి విజువల్స్ ఇచ్చారు. అలాగే 3 కోట్ల సినిమా కంటే బెటర్ గా విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ విషయంలో కూడా మెచ్చుకోవాలి. ఈ విజువల్స్ కి ది బెస్ట్ రీ రికార్డింగ్ ఇచ్చాడు సాయి కార్తీక్..   రీ రికార్డింగ్ కి రాధాకృష్ణ చేసిన ఆడియోగ్రఫీ కూడా అదిరిపోయింది. ఈ నాలుగు డిపార్ట్ మెంట్స్ సినిమాని విజువల్స్ పరంగా ఎక్కడికో తీసుకెళ్ళాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ డీసెంట్ అనిపించేలా ఉన్నాయి. ఇప్పటివరకూ బలమైన, బరువైన డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్రా ఈ రేంజ్ కామెడీ డైలాగ్స్ కూడా రాయగలడని ఈ సినిమా ప్రూవ్ చేసింది. నాగరాజ్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో వావ్ అనుకునేలా ఉంటే సెకండాఫ్ పరంగా వరస్ట్ అనిపించుకునేలా ఉంది. ఓయాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్ గా ఒకటి చెప్పాలి ఈ సినిమా టైటిల్ 'రాజుగారి గది'.. కానీ ఈ సినిమా టైటిల్ కి కథకి అస్సలు సంబంధం ఉండదు, టైటిల్ జస్టిఫికేషన్ అనేదే లేదు. ఎన్నో రోజులుగా రాజుగారిగది అని హైప్ పెంచుకుంటూ వచ్చి తీరా ఆ రాజుగారి గదిని ఫన్నీగా చూపడం సినిమాకి సింక్ కాని పాయింట్. 


హర్రర్ కామెడీ సినిమాల నేపధ్యంలో వచ్చిన మరో రెగ్యులర్ ఎంటర్టైనర్ 'రాజుగారి గది'. ఈ రాజుగారి గదిలో ఏముందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు కానీ చివరిగా ఆ రాజు గారి గదిలో ఏముందా అని చూపించడం మాత్రం చాలా సిల్లీగా ఉంటుంది. ఆ పాయింట్ ని పక్కన పెడితే రాజుగారి గది సినిమా అన్నది సగం ఆకలితోనే అన్నం ముందు నుంచి లేచేయ్యడం లానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపించినా సెకండాఫ్ పరంగా మాత్రం చాలా వరస్ట్ అనిపించుకుంటుంది. అసలు కథ అంతా సెకండాఫ్ లోనే చెప్పాలి, కానీ చెప్పలేక తడబడి, ఎంటర్టైన్మెంట్ చేసేద్దాం అనుకోని అదీ చేయలేక చివర్లో తన దగ్గర ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్ తో థ్రిల్ చేయలేక సినిమాని యావరేజ్ గా నిలిపెసాడు ఓంకార్.. ఈ మధ్య పరమ రొటీన్ సినిమాలకు అలవాటు పడిపోయిన మన తెలుగు ఆడియన్స్ కి రాజుగారి గది ఓవరాల్ గా ఓకే ఓకే అనేలా ఉంటుంది. మిగతా వారికి మాత్రం చెప్పేది ఒక్కటే ఫస్ట్ హాఫ్ చూసి సెకండాఫ్ ని స్కిప్ చేయండి.  



Ashwin Babu,Dhanya Balakrishna ,Omkar,Tandra Ramesh,Sai Karthikరాజుగారి గది - కేవలం కొన్ని నవ్వుల కోసం మాత్రమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: