స‌హ‌జంగా ముఖానికి అందాన్ని ఇచ్చే అంద‌మైన పెద‌వులు అందంగా, కాంతివంతంగా ఉండాల‌ని అంద‌రూ అనుకుంటారు. వాతావ‌ర‌ణం మార్పుల వ‌ల్ల తర‌చూ పొడిబారుతూ ఉంటాయి. ఈ సమస్యను నివారించేందుకు ఎన్ని సార్లు లిప్‌ కేర్‌ రాసినా, ఎక్కువ‌ మోతాదులో మంచినీళ్లు తాగినా పెదాలు మాత్రం పొడిబారుతూ ఇబ్బంది పెడుతుంటాయి. 


అలాగే స్మోకింగ్ అల‌వాటు ఉన్న‌వారు ఎన్ని చిట్కాలు ప్ర‌య‌త్నించినా ఉప‌యోగం ఉండ‌దు. వీరు స్మోకింగ్ మానుకుంటే చాలా ఉత్త‌మం. ఒక్కోసారి గులాబి రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముల్లులా మారి ఇబ్బందిపెడతాయి. ఇలాంటి వారు అందమైన, మృదువైన పెదాలకోసం మీరు త‌ప్ప‌కుండా ఈ చిట్కాల‌ను పాటించాల్సిందే..


- పొడిబారిన‌ పెదవులకు తాజా కలబంద గుజ్జు రాసి తేలిగ్గా మర్దన చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ పెదవులకు తగినంత తేమ సమకూరి మెత్తబడతాయి.


- గులాబీ రేకులు తీసుకుని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకుని రోజూ ఉదయాన్నే పెదవులపై రాస్తూ ఉండాలి.  గులాబీ రేకులు పింక్‌ అండ్‌ గార్జియస్‌ పెదాలను అందిస్తే.. పాలు డార్క్ క‌ల‌ర్‌ని తొల‌గిస్తాయి.


- ప్ర‌తిరోజు పొడిబారిన పెదవులకు మీగడ రాసుకుంటే సున్నితంగా, మృదువుగా మారతాయి.


- రాత్రి పడుకోవడానికి ముందు కొత్తిమీర తీసుకుని పెదాలపై రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెదాల‌కు తేమ స‌మ‌కూరి మృదువుగా మ‌రియు అందంగా త‌యార‌వుతాయి.


- పచ్చి బంగాళ దుంప ముక్కల్నిపెదవులకు రాసుకుంటే పెదవులు మెత్తబడటమే గాక నల్లని పెదవులు సైతం మంచి రంగులోకి మారి అందంగా క‌నిపిస్తాయి.


- నారింజ తొక్క పెదాల అందానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ తొక్కతో పెదవులపై మసాజ్‌ చేయాలి. దీనివల్ల మృదువుగా తయారవడంతోపాటు కలర్‌ఫుల్‌గా తయారవుతాయి. 


- పెదాలపై ఒకటి లేదా రెండు చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ వేసి, మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై డార్క్‌నెస్‌ తగ్గించి, మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.


-  రెండు, మూడు చుక్కల నిమ్మరసం పెదాలకు పట్టించిన‌ తర్వాత బాగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే పెదాలపై ఉండే న‌లుపును తొలిగించి తేమ స‌మకూర్చుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: