ఆధునిక జీవన విధానం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణంగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడాలని, తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా శ్ర‌మిస్తారు. ఈ క్ర‌మంలోనే స‌రైన వ‌య‌సులో పెళ్లి చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల సంతాన‌లేమికి కారణం అవుతాయి. మ‌రియు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, కాలుష్య వాతావరణంలో జీవించడం, సెల్ ఫోనులు అధికంగా ఉపయోగించడం వంటివి ఇతర సంతానలేమి కారణాలుగా చెప్పుకోవచ్చు. 


నిజానికి మన జీవితం ప్లాస్టిక్‌మయంగా మారింది. ఏది తినాలన్నా, ఏ పని చేయాలన్నా ప్లాస్టిక్‌ లేకుండా దాదాపు అసాధ్యమనే అనిపిస్తుంది. అధునిక కాలంలో ఆహార పదార్థాల కోసం ప్లేట్లు, టీ గ్లాసులు, నీళ్ల గ్లాసులు, ఇలా అన్నీ ప్లాస్టిక్‌నే వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడ‌కం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ప్లాస్టిక్‌లో ఉండే ర‌సాయ‌నాలు మ‌నిషికి ఎంతో హానిక‌రం చేస్తాయి. ఈ క్ర‌మంలోనే ప్లాస్టిక్ వాడ‌డం వ‌ల్ల కూడా సంతాన‌లేమి కారణం అంటున్నారు నిపుణులు.


ప్లాస్టిక్ వాడ‌డం వ‌ల్ల దీనిలో ఉన్న విష‌పూరిత ర‌సాయ‌నాలు శరీరంలోకి చేరి అంతర్గత హార్మోన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. దీంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అదే విధంగా మహిళల్లో కూడా ప్లాస్టిక్ వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి పెరిగిపోయి అపరిపక్వ అండాలు విడుదల అవుతాయి. దీంతో సంతాన‌లేమికి కార‌ణం అవుతుంది. ఏదేమైన ప్లాస్టిక్ వాడ‌కం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే ప్లాస్టిక్ వాడ‌కం త‌గ్గించ‌డం చాలా ఉత్త‌మం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: