
3months ago [IST]
ఈసారి కూడా అదే పంథాలో...!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడు సుకుమార్ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తొలి సినిమానే ఆయనకు పెద్ద సక్సెస్ ని అందించడంతో, ఆ తరువాత సుకుమార్ కు అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే ఫస్ట్ మూవీతో సక్సెస్ ని అందుకున్న సుకుమార్, ద్వితీయ విఘ్నాన్ని మాత్రం అధిగమించలేకపోయారు. రెండవ సినిమాగా హీరో రామ్ తో ఆయన తీసిన జగడం సినిమా ఘోర పరాజయంగా నిలిచింది. ఆ తరువాత ఆర్య2 తో మరొక ఫ్లాప్ అందుకున్న సుకుమార్, అనంతరం తెరకెక్కించిన 100% లవ్ సినిమాతో మళ్ళి సక్సెస్ సాధించారు. అయితే తరువాత ఆయనకు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని దర్శకత్వం వహించే అవకాశం లభించడంతో,
మహేష్ తో కలసి వన్ నేనొక్కడినే అనే ఎమోషనల్ థ్రిల్లర్ ని తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో రిలీజ్ అయిన ఆ సినిమా, పెద్ద ఫ్లాప్ గా నిలిచి, సుకుమార్ ను కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. అనంతరం కొంత గ్యాప్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన తీసిన నాన్నకు ప్రేమతో, అలానే ఇటీవల రామ్ చరణ్ హీరోగా తీసిన రంగస్థలం సినిమాలు, సుకుమార్ కు సూపర్ హిట్స్ ని అందించి, కెరీర్ పరంగా మంచి బూస్ట్ ని అందించాయి. ఇక అతి త్వరలో అల్లు అర్జున్ తో తన కొత్త సినిమాను మొదలెట్టనున్న సుకుమార్, ఈసారి కూడా రంగస్థలం సినిమా మాదిరే కమర్షియల్ ఎంటర్టైనర్ గా బన్నీ సినిమాను తెరకెక్కించనున్నారట. కథ పరంగా కొంత థ్రిల్లింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఉంటాయని, అయితే వాటిని ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యేలా మంచి కమర్షియల్ వే లో సుకుమార్ ఆ సినిమాని తీయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే దానికి ప్రధాన కారణం, కొన్నేళ్ల క్రితం ఆయన మహేష్ తో కలిసి తీసిన నేనొక్కడినే మూవీనే అంటున్నారు. నిజానికి ఆ సినిమా కథ, కథనాల పరంగా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ, దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంలో మాత్రం సుకుమార్ పూర్తిగా విఫలమవడంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే అక్కడినుండి సుకుమార్ ప్రయోగాలు ప్రక్కన పెట్టి, ఇకపై తన సినిమాలు ఒకింత కమర్షియల్ పంథాలో సాగేలా చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం వారి నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే....!!
మీ ఆదరణకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తమరు చదివిన ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే వాట్సాప్ లో షేర్ చేయండి.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను తీసివేసేందుకు మాకు సహకరించండి. వాటిని అభ్యంతరకరమైనవిగా గుర్తించండి. - ఇండియా హెరాల్డ్ గ్రూప్
-
Laptops for Every NeedTop Brands
Shop Now
-
Deals on Smart TVsCheck Best Offers
Check Out
-
PC AccessoriesGreat Prices
Shop Now
-
Amazon DevicesExtra Savings
Buy Now
-
Black Friday Sale29th Nov- 2nd Dec
Check Now
-
Best Selling TVsUp to 45% OFF
Buy Now
-
Best Mobile AccessoriesInstant Discount
Buy Now
-
Wireless HeadphonesLatest range
Check Now
-
Offers on DSLR CamerasUp to 20% off
Buy Now
-
Top Rated Home AudioImmersive Audio Experience
Check Out
-
Top Selling Wireless SpeakersSave up to to 50% on top brands
See Now
-
The Electronics StoreInstant Discount
Shop Now
-
Best LaptopsInstant Discount
Check Now
-
Mi TVsExtra Savings
Buy Now
-
RefrigeratorsLowest Prices
Buy Now
-
Choose the right printerBest Offers
Shop Now
-
Air Conditioners2019 Launches
Check Now
-
Best Selling LaptopsInstant Discount
Shop Now
-
Air ConditionersUp to 40% OFF
Buy Now
-
Latest Alexa DevicesNew Alexa Devices
Explore