రెజీనా.. 2001లోనే నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఎనిమిదేళ్ళ కాలంలో చాలా మూవీస్ చేసింది. తెలుగులో కూడా ఎక్కువగా  సినిమాలు చేసింది. అయితే ఆమె హీరోయిన్ గా మాత్రమే టాలీవుడ్లో  కనిపించింది. యంగ్ హీరోల పక్కన బెస్ట్ చాయిస్ గా కొన్నాళ్ల వరకూ తీసుకున్నారు. ఆ తరువాత ఫ్లాప్స్ రావడంతో వెనక్కి పెట్టేశారు.


ఇవన్నీ పక్కన పెడితే ఎవరు మూవీ ఇపుడు థియేటర్లలో మోత మోగిస్తోంది. బంపర్ హిట్ అయింది ఈ మూవీ. ఇందులో రెజీనావే ప్రధాన ఆకర్షణ. ఈ మూవీకి  ఓ విధంగా చెప్పాలంటే ఓ ప్రధానమైన పిల్లర్ గా ఆమె మోసింది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. గ్లామర్ డోస్ కూడా బాగానే ఉంది.


ఇలా అందం అభినయం కలబోసిన రెజీనాకు  మంచి హిట్ దొరికింది. ఆమెను ఈ సినిమా యూనిట్  నూటికి నూరు శాతం వాడుకుంది. ఆమెలోని టాలెంట్ ని విరగదీసి మరీ యూజ్ చేసుకుంది. ఎవరు మూవీ చూసిన వారికి ఒకే ఒక డౌట్. రెజీనాలో ఉన్న ఇంతటి నటనను ఎందుకు ఇన్నాళ్ళూ టాలీవుడ్ వాడుకోలేదు అని.


ఆమెకు సరైన పాత్ర ఇస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు నిరూపించింది. ఈ మూవీ తరువాత రెజీనాకు అవకాశాలు వస్తాయని చెప్పలేం కానీ వస్తే ఎలాంటి  టఫ్ రోల్ అయినా చేయడానికి సిధ్ధమని చెప్పకనే రెజీనా చెప్పింది. ఈ మూవీకి ముందు ప్రమోషన్లలో కూడా రెజీనా ఒకటే చెప్పింది మూవీ హిట్ అంటూ ఫుల్ కాంఫిడెన్స్ ప్రకటించింది.


అంతలా ఆమె నటించింది కాబట్టే హిట్ వూహించింది. ఏది ఏమైనా రెజీనా నటన బాగుందని అంతా అంటున్నారు. మరి ఈ ముద్దు గుమ్మను ఇకనైనా వాడుకోవాలి టాలీవుడ్. ఎంత వాడుకుంటే అంత అన్నట్లుగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెజీనా రెడీ అంటోంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: