బాలయ్య  ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న  బాలకృష్ణ సరసన  ఇద్దరు హీరోయిన్లు  సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. కాగా  ఇటివలే ఈ సినిమా  బ్యాంకాక్ షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  సోనాల్ చౌహాన్ ఈ రోజు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొందట.  ఒక పాట సీక్వెన్స్ కోసం సోనాల్ ఈ సినిమాలో  బికినీ వేసి ఆడిపాడనుందని సమాచారం.  గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి 'లెజెండ్, డిక్టేటర్' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.  'డిక్టేటర్' తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం.  కాగా ఈ సినిమాలో   బాలయ్య - సోనాల్ చౌహాన్  ట్రాక్ ఎమోషనల్ గా సాగనుందని సమాచారం.  అయితే సోనాల్ చౌహన్  మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.  


 సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అభిమానులు మాత్రం ఈ టైటిల్‌ను బాగా ఓన్ చేసుకున్నారు.  ఎప్పటికైనా ఆ టైటిల్‌ తో బాలయ్య సినిమా చేస్తే బాగుండని ఆశపడ్డారు.  మరి వారి కోరిక ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ఈ సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు.  గతంలో ఈయన బాలయ్యతో కలిసి 'జైసింహ' అనే చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే.  అలాగే  ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో  నమితను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. ముఖ్యంగా సినిమాలో  బాలయ్యకి విలన్ గా  కనిపించనుంది.  ఇప్పటికే  సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. 


అయితే ఆ మధ్య  ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో   బాలయ్య  కొని మార్పులు చెప్పారని..  బాలయ్య సూచన మేరకు  కె.ఎస్.రవికుమార్ కథలో మార్పులు చేసాడని.. కానీ ఆ మార్పులు బాలయ్యకి నచ్చలేదని రూమర్స్ వచ్చాయి. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదట. 


మరింత సమాచారం తెలుసుకోండి: