సినిమా ఇండ్రస్ట్రీ అనగానే ఆకాశంలోకి దూసుకెళ్ళి రంగులు వెదజల్లె తారజువ్వల తళుకుల్లా కనిపిస్తుంది.ఈనాడు ఇంతలా వెలిగిపోతున్న సినిమా ప్రపంచం ఈ స్దాయికి రావడానికి ఎందరో కృషిచేసారు.అద్బుతమైన మరుపురాని చిత్రాలెన్నో నిర్మించారు,నిర్మిస్తున్నారు.ఎంతో టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో గ్రాఫిక్ సినిమాలు తీయడంపెద్ద ఆశ్చర్యం కాదు.కాని సినిమాలు తీయడం మొదలైన రోజుల్లో ఎలాంటి టెక్నాలజీలేదు ఐనా ఎన్నో మంచిమంచి చిత్రాలు విడుదలై ప్రేక్షకుల్ని మాయాలోకంలో విహరింపచేసాయి.అద్భుతమైన జిమ్మిక్కులు పరిచయంచేసాయి.అలాంటి వాటిలో పాతాళభైరవి చిత్రం ఒకటని అప్పుడేకాదు ఇప్పటికి ఎప్పటికి ఒప్పుకోక తప్పదు.



ఇక ఈ చిత్రంలో యన్టీ రామారావు హీరోయిజానికి, యస్వీ రంగారావు విలనిజానికీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.విజయా బ్యానర్‌పై నాగిరెడ్డి-చక్రపాణి కలిసి నిర్మించిన సినిమా క్లాసిక్స్‌లో ముందు వరుసలో వుంటుంది.దర్శకుడి ప్రతిభాపాటవాలను నిండుగా వెండితెరపై ఆవిష్కరించగా జానపద చిత్రాలకు కొత్త ఒరవడిని,పరపతిని తెచ్చిన సినిమాగా దీనినిపేర్కొనాలి. అరేబియన్‌ నైట్స్‌ లోని ’అల్లాడిన్స్‌ వండర్‌ ల్యాండ్’కథను పింగళినాగేంద్ర మన నేటివిటీకి తగ్గట్టుగా మలచినతీరు అద్భుతం,అమోఘం..అప్పట్లో ఈ సినిమాచూసినప్రేక్షకులు యన్టీఆర్‌కు ఫ్యాన్స్‌ గా మారిపోయారు.ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ సూపర్‌స్టార్‌డమ్‌కు తిరుగులేని పునాది పడిందని తెలుగుసినిమాపెద్దలు చెబుతుంటారు.అలాగే,మాంత్రికుడి గెటప్‌లో యస్వీఆర్‌అభినయాన్నిచూసి భయపడ్డ ప్రేక్షకులుకూడావున్నారు.ఈ సినిమాలో పింగళి వారి పాళీ కొత్త పుంతలు తొక్కి సరి కొత్త మాటల్ని సృష్టించింది.



ఇక సంగీతం పరంగా కూడా ఈ సినిమా సూపర్‌ హిట్టే! ప్రముఖ గాయకుడు ఘంటసాల వినసొంపైన బాణీలు కట్టగా వాటికి పింగళి పసందుగా సాహిత్యాన్ని అందించారు.అందులో కలవర మాయే మదిలో’ఎంత ఘాటు ప్రేమయో’తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానం’ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను వీనుల విందుగా అలరిస్తూనే వున్నాయి.ఇక కమెడియన్‌ రేలంగి పాడి ఆడిన పాట’వినవే బాలనా ప్రేమ గోల’ కూడా సూపర్‌ హిట్‌ సాంగే!. అలాగే కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే,కళాధర్‌లు రూపొందించిన సెట్స్‌ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. రాకుమారి మహల్‌,మాంత్రికుడిగుహ వారిప్రతిభకు మచ్చుతునకలుగా చెప్పవచ్చు.తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని 1951మార్చి15న రిలీజ్‌చేయగా రెండుభాషల్లోనూ కూడా అమోఘవిజయాన్నిసాధించి,యన్టీఆర్‌కు కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టి తెలుగు వారి హృదయాలలో చెరగనిముద్రనువేసింది.ఈ సినిమా అప్పట్లో 28సెంటర్లలోశతదినోత్సవాన్నిజరుపుకోగా,ఈ చిత్రంతోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ అంతటా చిత్రయూనిట్‌ విజయ యాత్రలు మొదలయ్యాయి.తోటరాముడిగా ఎన్టీరామారావు,మాంత్రికుడిగా ఎస్‌వి రంగారావు,రాజకుమారిగా కె.మాలతి ముఖ్యపాత్రలు పోషించగా తొలిసారిగా 1952వ సంవత్సరంలో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లొ ప్రదర్శించబడిన తొలితెలుగుచిత్రం ‘పాతాళభైరవి’ కావడం విశేషం..


మరింత సమాచారం తెలుసుకోండి: