హీరో శర్వానంద్ రణరంగం సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాలో'కథ లేదని ముందు నుంచి చెబుతూనే వున్నా' అంటూ ఓ పనికిమాలిన స్టేట్ మెంట్ పడేశాడు. అంటే కథనాన్ని నమ్మి సినిమా చేసారన్న మాట. మరి ఈ సంగతి ఇప్పుడు తెలిసిందా? శర్వానంద్ కు? కథ విన్నపుడే ఇది పాత కథలా వుంది. దాంతో పాటుగా సుధీర్ వర్మ ట్రాక్ రికార్డ్ కూడా తెలిసే ఉంటుంది కదా. కేవలం కథనం మాత్రం నమ్ముకుంటే హిట్ పడుతుందా? అని ఆలోచించాలి కదా? ఎటూ పడి పడి లేచే మనసు సినిమాతో అనుభవం వచ్చింది కదా..! ఏదేమైనా ఒక విషయంలో మాత్రం శర్వా కొత్త రికార్డు సృష్టించాడు. సినిమాల జయాపజయాలు ఎలా వున్నా ఇప్పటి వరకు హారిక హాసిని సంస్థకు కానీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కానీ నష్టాలు లేవు. 

సినిమాలు యావరేజ్ అయినా, అజ్ఞాతవాసిలా డిజాస్టర్ అయినా, బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చినా, ఏం చేసినా, ఓ రూపాయి లాభంలోనే వుంటూ వచ్చారు తప్ప, చేతితో డబ్బులు పడలేదు. అందుకే నాన్ స్టాప్ గా సినిమాలు తీస్తూ వస్తున్నారు. అలాంటిది మొదటిసారి సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు మూడు నాలుగు కోట్లు నష్టం వచ్చేలా చేయగలిగిన సినిమాగా రణరంగం, ఆ సినిమా డైరక్టర్ గా సుధీర్ వర్మ, హీరోగా శర్వానంద్ ఆ సంస్థల చరిత్రలో మిగిలిపోతారని ఇప్పుడు ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు రెండేళ్లపాటు నిర్మాణం సాగించి, ఖర్చు తడిసి మోపెడు అయినందుకు. 

శర్వానంద్ మూడ్ ఔట్ అయినపుడల్లా షూటింగ్ లేట్ అయ్యేదని ప్రస్తుతం వినిపిస్తుంది. పడి పడి లేచెమనసు ఫ్లాప్ అయ్యేసరికి కొద్దిరోజులు మూడ్ అవుట్ అయి షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ టేకింగ్, సెట్ లు అన్నీకలిసి నిర్మాణ వ్యయాన్ని శర్వా మార్కెట్ కు మించి పెంచేశాయి. అదే సమయంలో పడి పడి లేచే మనసు సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో, రణరంగం మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇక ఈ సినిమాతో పోటీ కి దిగిన అడవి శేష్ ఎవరు సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో శర్వా రణరంగం కి ఇంకా గట్టి దెబ్బ పడింది. మొత్తానికి శర్వాకి మళ్ళి గట్టి ఫ్లాప్ పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: