లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్. హై స్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్ జే ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆష్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోయ్ చిత్రాన్ని నిర్మించారు ఆర్ రవి శేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్. ఆగస్ట్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కు ఏం మెసేజ్ ఇవ్వాల‌ని సినిమా తీశాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో మంచి చెపుతాడా లేక ఇంకేదైనా చూపిస్తాడా అని కొంద‌రు అనుకుంటున్నారు.  టీనేజ‌ర్ల‌తో  చేసే ఈ సినిమా ద్వారా మంచి చెపితే బావుంటుంది. కాని ట్రైల‌ర్‌లో అలా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. స్కూల్ డేస్‌లో ప్రేమ వ్య‌వ‌హారాలు లాంటివి చూపించ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌ను ఇంకా ఎంక‌రేజ్ చేసిన‌ట్లు ఉంటుంద‌ని కొంద‌రు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాల వ‌ల్ల ప్ర‌త్యేకించి వ‌చ్చేదేమీ లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే చెడును చూపించ‌డ‌మే అవుతుంద‌ని కొంద‌రి భావ‌న‌. ఈ మ‌ధ్య బోల్డ్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌వ‌డంతో ద‌ర్శ‌కులంద‌రూ ఆ పంధాలో న‌డుస్తున్న‌ట్ల తెల‌స్తుంది కానీ 


లక్ష్య, సాహితి, నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ తదితరులు న‌టిస్టున్న ఈ చిత్రానికి దర్శకుడు: అమర్ విశ్వరాజ్, నిర్మాతలు: ఆర్ రవి శేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్, నిర్మాణ సంస్థ: విశ్వరాజ్ క్రియేషన్స్, సహ నిర్మాతలు: శశిధర్ కొందురు, ప్రదీప్ మునగపాటి, సినిమాటోగ్రఫీ: ఆష్కర్, 
సంగీత దర్శకులు: ఎల్విన్ జేమ్స్, జయప్రకాశ్ జే, ఎడిటర్: ఏకలవ్యన్, ఆడియోగ్రఫీ: జే రాఘవ్ చరణ్
డిఐ కలరిస్ట్: రామ్మూర్తి నేత, పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్ అండ్ భాను, సౌండ్ ఎఫెక్ట్స్: జేఆర్ యతిరాజ్


మరింత సమాచారం తెలుసుకోండి: