బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ సక్సెస్ తరువాత టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించి, ప్రస్తుతం బాలీవుడ్ రేంజి స్టార్ హీరో స్టేటస్ లో కొనసాగుతున్నారు. ఇకపోతే ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో, ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటూ ఈనెల 30వ తేదీన అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేలాదిమంది అభిమానులు మరియు సాహో యూనిట్ సహా పలువురు అతిథుల సమక్షంలో ఎంతో వైభవోపేతంగా జరుగుతోంది. సాహో సినిమాలో వాడిన పలు రకాల గన్స్, కార్, ప్రాక్లేయినర్స్, ట్రక్స్, ట్యాంకర్స్ తదితర ఇతర వస్తువులను ఈ ప్రి రిలీజ్ వేడుక వద్ద స్పెషల్ గా రెబల్ స్టార్ ఫ్యాన్స్ వీక్షణార్ధం  ఏర్పాటు చేయడం జరిగింది. 

ఇక ఈ వేడుకకు అతిథులుగా విచ్చేసిన పలువురు, సాహో సినిమా అద్భుత విజయాన్ని అందుకుని, మంచి పేరు మరియు కలెక్షన్ ని రాబట్టాలని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే టాలీవుడ్ లో అమ్మోరు, అరుంధతి వంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ ని అందించిన సూపర్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఈ వేడుకకు ప్రత్యేక స్థితుల్లో ఒకరిగా హాజరై, హీరో ప్రభాస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఒక తెలుగు సినిమా హీరో, నేడు బాలీవుడ్ హీరోల రేంజికి చేరి దూసుకెళ్తుండడం ఎంతో ఆనందమని, ఇక తాను ఇందాక ఈ ఫంక్షన్ కోసం ఇంటి నుండి బయల్దేరుతున్న సమయంలో, ఆయన తల్లిగారు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగారట. అయితే ఆ ప్రశ్నకు బదులిస్తూ, ప్రభాస్ కొత్త సినిమా సాహో ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అని ఆయన అన్నారట. వెంటనే అయన తల్లిగారు మాట్లాడుతూ, ప్రభాస్ అచ్చం మీ నాన్నగారిలా మంచి ఒడ్డు, పొడుగుతో ఎంతో చక్కగా ఉంటాడు అంటూ, తన సినిమా ఎలాగైనా ఒకసారై చూడాలి, టికెట్స్ తెప్పించు అని అడిగారట. 

ఆ తరువాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సతీమణి కూడా, ప్రభాస్ ని చూసి చాలారోజులు అయింది, ఈ సారి తప్పకుండా అతని సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంటూ అడిగారట. ఆ వెంటనే ఆయన మేనకోడలు కూడా తనకు సాహో సినిమాకు కొన్ని టికెట్స్ కావాలని, ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ కి టికెట్స్ దొరకడం కష్టంగా ఉంది, కాబట్టి త్వరగా బుక్ చేయండి అంటూ అడిగిందట. ఆ తరువాత ఆయన మనుమడు ఇంట్లోనుండి వస్తూ, భళిభళిరా భళి అంటూ బాహుబలి సినిమాలోని పాటపడుతూ ప్రభాస్ ప్రభాస్ అంటూ అరవడం మొదలెట్టాడట. ఆ విధంగా పెద్దావిడ నుండి చిన్న పిల్లవాడివరకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టపడతారని, తనకు కూడా మొదటినుండి ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం అని, సాహో తప్పకుండా బాహుబలి రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందని ఆయన సినిమా యూనిట్ కి ముందస్తుగా అభినందనలు తెలియచేసారు .....!!


మరింత సమాచారం తెలుసుకోండి: