నిజజీవితంలో మామాఅల్లుళ్లైన విక్టరీ వెంకటేష్,అక్కినేని నాగచైతన్య స్క్రీన్ పై కూడా మామఅల్లుళ్లలా కలసినటిస్తున్నమూవీ వెంకీమామ.బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్నఈ సినిమా చిత్రీకరణ ఇప్పటివరకు చాల వేగంగా జరుపుకుంటు దాదాపు పూర్తిదశకు చేరుకుంది.ఎఫ్2 ఇచ్చిన కిక్ తో ఫుల్ జోష్‌లో వున్న వెంకి ఎంతో ఎనర్జిటిక్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కాస్తబ్రేక్ పడింది.వివరాల్లోకి వెళ్లితే హీరో వెంక‌టేష్‌కు వెంకీమామ షూటింగ్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ గాయాల‌య్యాయి.ఈ చిత్రంలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా వెంకీ కాలు బెణికి నడవలేని స్దితికి వచ్చిందట,దీంతో షూటింగ్‌ని అర్ధంతరంగా నిలిపేయాల్సి వచ్చిందట.రాజుసుందరం నృత్యదర్శకుడుగా వెంకటేష్,పాయ‌ల్ రాజపుత్‌లపై రామోజీ ఫిలింసిటీలో ఓ పాట‌ను చిత్రిస్తుండగా ఆయన కాలుబెణికిందని వెంటనే వెంకీని ఆసుపత్రికి తరలించగా కాలి గాయాన్ని పరీక్షించిన వైద్యులు గాయం చిన్నదే కాబట్టి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారట.



వెంకీ కోలుకున్న తరవాతే ఈ పాటని తెరకెక్కిస్తామని చిత్రబృందం తెలిపింది.ఇక ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా ఆర్‌ఎక్స్‌100’ఫేమ్‌ పాయల్‌రాజ్‌పుత్‌, నటిస్తుండగా నాగచైతన్యకుజోడీగా రాశిఖన్నానటిస్తోంది.సురేశ్‌ప్రొడక్షన్‌ప్రై.లి,పీపుల్‌ మీడియాఫ్యాక్టరీసంస్థలు సంయుక్తంగానిర్మిస్తున్నఈచిత్రానికి డి.సురేశ్‌బాబు,టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాతలు.కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాపై దర్శకుడు బాబీ పూర్తినమ్మకంతో ఉన్నాడు.అంతేకాకుండా'ఎఫ్ 2'తరువాత వెంకటేశ్ నుంచి వస్తున్న మరో వినోదభరిత చిత్రం కావడంతో,అటు అభిమానుల్లోను అంచనాలు వున్నాయి.



ఇప్పటికే ఈ మూవీడైరెక్టర్ బాబీ బర్త్‌డే సందర్భంగా,అతనికి విషెష్ చెప్తూ..ప్రీ-టీజర్ పేరుతో'స్నీక్ పీక్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ మామా & అల్లుడు'అంటూ వెంకీమామ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రబృందం.ఈ వీడియోలో 'దగ్గుబాటి మామ,అక్కినేని అల్లుడు ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.ఈ వీడియోతో ఫ్యాన్స్ లో క్రేజీని సంపాదించుకున్న ఈసినిమా ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.ఇక ఇటీవలే శంషాబాద్‌లో ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్స్ షూట్ చేశారట.ఆగస్టు 15 నాటికి ఒక్క పాట మినహా సినిమా పూర్తవుతుందని త్వరలో టీజర్ రిలీజ్ చేసి దసరాకి ఈ సినిమా విడుదల చెయ్యలనుకున్నామని ఇంతలోనే షూటింగ్ ఆగిపోయిందని నిర్మాతలు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: