మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన్ విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాపై మొదట్లో వచ్చిన టీజర్ తో పాటుగా రీసెంట్ గా రిలీజైన మేకింగ్ వీడియోతో అంచనాలు పెరిగాయి.


ఇక చిరు బర్త్ డే కానుకగా రెండు రోజుల ముందు అంటే ఆగష్టు 20న సైరా టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు తెలిసిందే. సైరా సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు దానికి సంబందించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.


సైరా సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ వాయిస్ ఇస్తున్నప్పుడు చిరు, సురేందర్ రెడ్డి పక్కనే ఉండి సలహాలు ఇస్తున్నారు. ఇక ఫైనల్ గా ఎండ్ కార్డ్ లో సైరా నరసింహా రెడ్డి అని పవన్ గట్టిగా డైలాగ్ చెప్పగా అందరు క్లాప్స్ కొట్టారు. చిరు, పవన్ ఒకచోట కనిపిస్తేనే మెగా ఫ్యాన్స్ కు పండుగ అనిపిస్తుంది. అలాంటిది చిరు సైరాకు పవన్ వాయిస్ ఇవ్వడం.. ఆ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పొచ్చు.        


సైరా సినిమా మరో బాహుబలి రేంజ్ సినిమా అవుతుందని అంటున్నారు. మేకింగ్ వీడియో తో ఆశ్చర్యపరచిన సూరి తప్పకుండా టీజర్ తో అంచనాలు పెంచేస్తాడని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి సైరా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కేవలం సైరా టీజర్ వరకేనా లేక సినిమాలో కూడా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: