ప్రభాస్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే  కాదు జాతీయ స్థాయిలో వినిపిస్తుంది.  ఈశ్వర్ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు లాగే రెబల్ గా కనిపించాడు. ఎత్తు,పర్సనాలిటీ, అందం ఒక హీరో ఇలా ఉండాలని అనిపించేలా ప్రభాస్ ఆహార్యం ఉంటుంది.  మొదటి సినిమా కాస్త పరవాలేదు అనిపించినా..తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  ఇక కెరీర్ లో ముందుకు సాగుతాడా అన్న సందేహంలో ఉండగా దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘చత్రిపతి’ సినిమాతో ప్రబాస్ వెనక్కి చూడలేదు. 

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రభాస్ స్థాయి ఎక్కడికో వెళ్లింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలో మిర్చి మాస్ హిట్ కొట్టడంతో ప్రభాస్ స్టార్ రేంజ్ కి ఎదిగారు.  ఇదే సమయంలో రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి’ తెరకెక్కించారు.  బాహుబలి, బాహుబలి 2 మూవీలు తీయడానికి ఏకంగా ఐదు సంవత్సరాలు పట్టింది.  ఇప్పటి వరకు ఏ హీరో కూడా తన సమయాన్ని మొత్తం అంతగా వెచ్చించలేదు..ఒక్క ప్రభాస్ తప్ప.  అందుకే ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.

బాహుబలి 2 తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించింది.  ఈ ఈవెంట్ కి వేల సంఖ్యలో అభిమానులు రావడం చూసి ఇక ప్రభాస్ భావోద్వేగానికి లోనయ్యారు. రాజమౌళి మాట్లాడుతుండగా ప్రభాస్ కాస్త ఎమోషనల్ కాగా, తన పెదనాన్న కృష్ణం రాజు ఇచ్చిన స్పీచ్ కి ఏకంగా కంటతడి పెట్టుకున్నాడు.

తన సినీ ప్రస్థానానికి మూల కారణం తన పెదనాన్న అని ఆయన మాట ఇప్పటి వరకు ఏదీ నేను జవదాటలేదని ఆయన నాకు దైవం లాంటి వారని ప్రభాస్ ఎన్నో సందర్భాల్లో అన్నారు. గతంలో బాహుబలి ఆడియో వేడుకలో రాజమౌళి అన్న కీరవాణి పాటకు ఎమోషనల్ అయినట్టు ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ ప్రభాస్ కూడా కొంత ఎమోషనల్ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: