బాలీవుడ్ స్టార్ హీరోయిన్  కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్వీన్'.   అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తాజాగా సౌత్ లో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.  ప్రస్తుతం అన్నివెర్షన్ ల షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కాగా  విడుదలకు మాత్రం నోచుకోవట్లేవు.   ఇఇక  'పారిస్ పారిస్' అనే టైటిల్ తో తెరకెక్కిన  తమిళ రీమేక్ లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా  రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు.  ఇటీవల ఈ సినిమా ను సెన్సార్ కు పంపించగా  సెన్సార్ బోర్డు ఏకంగా 25 కట్లు చెప్పడంతో  షాక్ తిన్నారు చిత్ర యూనిట్.  



అయితే తాజాగా ఈ విషయం ఫై కాజల్ స్పందిస్తూ..  క్వీన్ సినిమా ను చెడగొట్టకుండా ఎంతో జాగ్రత్తతో ఈ సినిమా  తీశాం. అయితే సెన్సార్ బోర్డు  అన్ని కట్స్ చెప్పేసరికి నాకు ఆశ్ఛర్యం వేసింది. ఆ సన్నివేశాలతో వారికీ అభ్యంతరం ఏంటో నాకు అర్ధం కావడంలేదు. మేము ఎవరిని కించ పరచలేదు.  మన నిజజీవితంలో  జరిగే  సంఘటనల  ఆధారంగా ఆ సీన్లను తెరకెక్కించాం.  ఈవిషయం లో నిర్మాతలు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను.  అలాగే తొలిగించిన సీన్లను  మళ్ళీ  సినిమాలో ఉండేలా సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలని కోరింది.  అయితే మిగతా మూడు భాషల్లో  సెన్సార్ బోర్డు ఇన్ని కట్స్ చెప్పలేదని ఈ సందర్భంగా  కాజల్ తెలియజేసింది.



ఇక క్వీన్ ను  తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మీ' అనే టైటిల్ తో రీమేక్ చేశారు.  ఈ చిత్రంలో తమన్నాప్రధాన  పాత్రలో  నటించగా  'అవె' ఫెమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు.  అలాగే కన్నడలో  'బట్టర్ ఫ్లై'  అనే టైటిల్ తో రీమేక్ చేయగా  పరుల్ యాదవ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో  నటించింది. రమేష్ అరవింద్ తెరకెక్కించారు.  ఇక మళయాలంలో 'జాం జాం' అనే టైటిల్ తో రీమేక్ చేయగా  మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. నీలకంఠ రెడ్డి ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: