నిన్న జరిగిన ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హడావిడి ముగిసి ఒకరోజు కూడ పూర్తి కాకుండానే ఈ ఫంక్షన్ లో ఈ మూవీ యూనిట్ అనుసరించిన ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ప్రభాస్ అభిమానులకు తీవ్ర అసహనం కలిగిస్తున్నట్లు టాక్. ‘సాహో’ కి సంబంధించిన మూడవ పాట ‘బ్యాడ్ బాయ్’ ని నిన్నటి ఈవెంట్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఈ పాటలో ప్రభాస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో చిందులు వేసాడు. వాస్తవానికి ఈ మూవీలో జాక్వెలిన్ నటిస్తున్న విషయానికి సంబంధించి ముందుగానే లీకులు వచ్చినా ‘సాహో’ యూనిట్ స్పందించక పోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ శ్రీలంక బ్యూటీ ‘సాహో’ లో లేదు అని భావించారు. అయితే అభిమానులకు షాక్ ఇవ్వాలని ప్రభాస్ జాక్వెలిన్ ల పాటను నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చేసి ఈమూవీ పై మరింత క్రేజ్ పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేసారు. 

నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదలైన ఈ పాటను ప్రభాస్ అభిమానులు మళ్ళీమళ్ళీ చూడాలని ఈరోజు ఉదయం నుండి యూట్యూబ్ లో తెగ వెతుకుతున్నారు. అయితే ఆ పాటను ‘సాహో’ యూనిట్ యూట్యూబ్ లో పెట్టకుండా ఆ పాటకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి ఒక లింక్ ఇచ్చారు. 

దీనితో ఆ లింక్ పై క్లిక్ ఇస్తే తాము చూడాలి అని అనుకుంటున్న ‘బ్యాడ్ బాయ్’ పాట కనపడుతుందేమో అని భావిస్తే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే నిన్నటి ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మళ్ళీ కనిపిస్తోంది. దీనితో సహనం కోల్పోయిన ప్రభాస్ అభిమానులు తాము ‘బ్యాడ్ బాయ్’ పాటను చూడాలి అనుకుంటే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఎన్ని సార్లు చూడాలి అంటూ తల పట్టుకుంటున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: