మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా'లో ఉయ్యాల వాడకి నమ్మిన బంటుగా ఓబయ్య పాత్రలో నటించిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి 'ఉప్పెన' లో హీరోయిన్ కి తండ్రి పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే సైరాలో మెగా స్టార్ తో కలిసి నటించిన విజయ్ ఇప్పుడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తో నటిస్తుండటం విశేషం. మరి ఈ రెండు మెగా ప్రాజెక్ట్స్ విజయ్ కి తెలుగులో నటుడిగా ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడతాయో చూడాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ నుండి సాయి తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే కాకినాడలో మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ ప్రారంభించారు. 19 నుండి విజయ్ సేతుపతి షూట్ లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర కాస్త నెగిటివ్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్ షూట్ చేయనున్నారని తాజా సమాచారం. దీని కోసం సారథీ స్టూడియోస్ లో ప్రత్యేకంగా హౌజ్ సెట్ వేశారు. ఈ హౌజ్ లోనే ప్రస్తుతం షూట్ శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యుల్ లో ఎక్కువగా విజయ్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ కంప్లీట్ చేనున్నారట. అందుకే తమిళ సినిమాలతో   బిజీ గా ఉన్నప్పటికీ ఈ షెడ్యుల్ కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట విజయ్ సేతుపతి. ఇక గత కొన్ని రోజులుగా ఉప్పెన సినిమా నుండి తప్పుకున్నాడని వస్తున్న వార్తలకు చెక్ పెడుతు షూటింగ్ లో జాయిన్ అయిన సందర్భంగా విజయ్ ఫొటోను రివీల్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: