ఒక డైరెక్టర్ కి స్టార్ డైరెక్టర్ గా వచ్చిన ఇమేజ్ పోవడం ఒక్క సినిమాతో పని. నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లిచ్చినా కూడా ఒకే ఒక్క డిజాస్టర్ పడితే కెరీర్ ఇరకాటంలో పడుతుంది. ఇలా చాలామంది డైరెక్టర్స్ కి జరిగిందన్న విషయం మనం గమనించే ఉంటాము. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పరిస్థితి కూడా ఇదే. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఓ ఇంటలెక్చ్యువల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హను రాఘవపూడి. కానీ ఆ పేరు మొత్తం పోవడానికి ఎంత కాలమో పట్టలేదు. లై, పడి పడి లేచేమనసు సినిమాలు నిర్మాతలను, బయ్యర్లను భారీ నష్టాల పాలు చేశాయి. హీరోల కెరీర్ కు లెగ్ బ్రేక్ వేసేశాయి. దాంతో ఇక డైరక్టర్ గా హను రాఘవపూడి కెరీర్ కు ఫుల్ స్టాపే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.    

కానీ లేటెస్ట్ గా హను రాఘవపూడి..నేచురల్ స్టార్ నాని డేట్స్ కోసం ట్రయ్ చేస్తున్నట్లు తాజా సమాచారం. నానికి లైన్ లేదా మొత్తం కథ చెప్పి ఒప్పించే పనిలో హను బిజీగా వున్నారని తెలుస్తోంది. నిజంగా అంతగా ఎగ్జయిట్ చేసే స్టోరీ తెస్తే నాని ఓకె అనే అవకాశం వుంది. కానీ అసలే నాని కెరీర్ కూడా అంతంత మాత్రంగా ఉంది. జెర్సీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుంది. ఇక గ్యాంగ్ లీడర్ ఎలా వుంటుందో తెలియదు. ఇంద్రగంటి 'వి' సినిమా అన్నది ఓ వినూత్న ప్రయత్నం.

ఈ రెండు సినిమాల తరువాత ఏ సినిమా చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేకపోతున్నాడు నాని. గ్యాంగ్ లీడర్ ఫలితం బట్టి నాని నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఆధారపడి వుంటుంది. గ్యాంగ్ లీడర్ హిట్ అయితే కచ్చితంగా మంచి ప్రాజెక్టు, మంచి కాంబినేషన్ కోసం చూస్తాడు. లేదూ తేడా వస్తే, ఇంకా జాగ్రత్తగా ప్రాజెక్టు సెట్ చేయాలని చూస్తాడు. ఈ రకంగా చూసుకుంటే హను రాఘవపూడికి హీరో నాని డేట్ లు దొరకడం చాలా కష్టమేనని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: