పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి  పవన్ ను మరియు ఆయన పార్టీను తొక్కడానికి కొన్ని రాజకీయ శక్తులు అలాగే  వైసీపీ అండ్ టీడీపీ నాయకులూ ఎంతలా ప్రయత్నించారో  అందరికి తెలుసిన విషయమే.  అప్పటీవరకూ  పొగిడిన వారంతా కూడా  పవన్ ఎత్తి చూపించారు. ఇలాంటి వారు అందరికి వత్తాసుగా పలికే  పేరుగాంచిన కొన్ని మీడియా చానెళ్లు గంటల గంటల డిబేట్లు పెట్టాయి పవన్ చేతగాని తనం మీద.  సరే ఇదంతా ఎన్నికల ముందు వరకు దెబ్బ తీసేందుకు చేసారు,  సక్సెస్ అయ్యారు.  కానీ ఎన్నికలు ముగిసి జనసేన ఘోరమైన ఓటమి పాలైన తర్వాత కూడా   జనసేన పై కొన్ని పేరున్న మీడియా సంస్థలు ఇంకా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి.  అసలు పవన్ అనని మాటను కూడా స్వయంగా అతనే అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి ఆ మీడియా సంస్థలు. పవన్ ఇప్పటికే ఎన్నో వందల సార్లు తన ప్రాణం పోయినా సరే ఏ పార్టీలోనూ జనసేన పార్టీను విలీనం చెయ్యను అని డబ్బులు లేకపోయినా  తన పక్క వాళ్ళు  తనని వదిలేసినా  టెంట్ వేసుకొని అయినా సరే పార్టీను నడుపుతాను,  అంతేకానీ  ఇంకో పార్టీలో విలీనం చెయ్యనని పవన్ ప్రతి సమావేశంలో చెబుతూనే ఉన్నాడు. 


 అయినా  మన మీడియా సంస్థలు మాత్రం పవన్ జనసేన పార్టీను విలీనం చేసేస్తారని,  పవన్  పై కేంద్రం  ఒత్తిడి తీసుకువస్తుందని.. ఇక జనసేన విలీనం ఖాయమన్న రేంజ్ లో తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అసలు పవన్ కు అంత సీన్ లేదని చెప్పేది వీళ్ళే.. అలాగే   పవన్ కు రాజకీయాలు అంటే ఏమిటో తెలీదు అని చెప్పేది వీళ్ళే.  మరి విషయం లేనప్పుడు  పవన్ ను మరియు ఆయన  పార్టీను ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారో..  వారికే తెలియాలి. ఒక్కటి మాత్రం చాల స్పష్టంగా తెలుస్తోంది. పవన్ ఇలాగే రాజకీయాల్లో కొనసాగితే.. భవిష్యత్తులో పవన్ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.      


మరింత సమాచారం తెలుసుకోండి: