సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమాకి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే.  సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమా  పూర్తి వివరాలను మరియు ఈ సినిమా సాంకేతిక విభాగాన్ని ఇటీవలే  అధికారికంగా ప్రకటించారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ ప్రారంభం కానుంది.  ఏమైనా  సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో  కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో  ప్రేక్షకులకు  డిఫరెంట్ చిత్రాలను అందిస్తూ.. ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే స్టార్ హీరోల్లో..   సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు.. 'గజినీ', 'సెవెన్త్ సెన్స్' వంటి ఓ కొత్తరకం సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు  ఉన్నాయి. ఇక  గోపీచంద్ తో 'శౌర్యం' సినిమాతో  డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత  తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి  బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు.  కాగా ఇప్పుడు సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.  

 

ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య  క్యారెక్టర్ చాలా బాగుంటుందట.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సూర్య  మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. సినిమా ప్రోమోస్ కు వస్తోన్న స్పందన చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది.  ఇక సూర్య - శివ కలయికలో వచ్చే ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్  డి ఇమ్మాన్ ఈ  సినిమాకి మ్యూజిక్ ను సమకూర్చనున్నారు.  అలాగే  ఈ సినిమా కోసం కెమెరామెన్ గా  ప్రముఖ కెమెరామెన్  వెట్రీ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాను  జనవరిలో పొంగల్ సందర్భంగా  రిలీజ్  చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  


మరింత సమాచారం తెలుసుకోండి: