బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ఐదవవారం నామినేషన్స్ లో ఊహించని విధంగా అందరు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను టార్గెట్ చేశారు. ఈసారి నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ రెడ్, బ్లాక్ బాల్స్ టాస్కులా చేశారు. రెడ్ బాల్ వస్తే వారు కన్ఫెషన్ రూంలోకి వెళ్లి నామినేషన్ చేయాల్సిన ఇద్దరు పేర్లు చెప్పాల్సి ఉంటుంది.  


ఒకవేళ కంటెస్టంట్స్ కు బ్లాక్ బాల్ వస్తే అక్కడ ఉన్న ఎర్ర రంగుతో ముఖానికి రాసి వారిని నామినేట్ చేసి అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టంట్స్ అందరు రాహుల్ మీద గుర్రుగా ఉన్నారు. మొదటివారం హేమతో గొడవ జరిగినప్పుడు హౌజ్ లో స్టాంగ్ కంటెస్టంట్స్ లో ఒకరుగా అనిపించిన రాహుల్ రాను రాను బిగ్ బాస్ హౌజ్ లో చాలా లైట్ గా ఉన్నట్టు అనిపించింది. 


అంతేకాదు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో కూడా రాహుల్ సిన్సియర్ గా పాల్గొంటున్నట్టు కనిపించలేదు. పునర్నవితో మొదలైన ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆమె కూడా తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే రాహుల్ ఇంకా గేమ్ సీరియస్ గా ఆడాలంటూ అతన్ని నామినేట్ చేసింది. కెప్టెన్ అయిన కారణంగా డైరెక్ట్ గా ఒకరిని నామినేట్ చేయాలని ఆలి రెజాను బిగ్ బాస్ కోరారు. ఆలి రెజా బాబా భాస్కర్ ను నామినేట్ చేయడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.     


ఇక ఐదో వారం నామినేషన్ లో ఉన్న వారి సభ్యుల వివరాలు చూస్తే.. రాహుల్, హిమజ, శివ జ్యోతి, పునర్నవి, బాబా భాస్కర్, అషు రెడ్డి, మహేష్ విట్టలు ఉన్నారు. వీరిలో ఎవరు ఈ శని, ఆదివారాల్లో హౌజ్ నుండి బయటకు వెళ్తారో తెలియాల్సి ఉంది. ఇది బిగ్ బాస్ హౌజ్ ఏమైనా జరగొచ్చు మరి ఏం జరుగుతుందో నాగార్జున వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: