రావి కొండలరావు తెలుగు పరిశ్రమలో ఈయన గురించి చాలా తక్కువమంది తెలుసు.. ఆ తెలిసిన కొంతమందికి కూడా ఈయన కేవలం నటుడు అనే అనుకుంటారు.. కాని అతనో రచయిత.. నాటకాలు రాసిన రావి కొండలరావు బాపు, రమణల సినిమాలకు కథలు అందించారు. తెలుగులో సూపర్ క్లాసిక్ మూవీస్ గా ఇప్పటికి చెప్పుకునే పెళ్లిపుస్తకం, బృందావనం, భైరవద్వీపం సినిమాలకు రావి కొండలరావు కథ అందించారు.      


రైటర్ గా అసిస్టెంట్ డైరక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా 600 పైగా సినిమాల్లో నటించారు కొండల రావు. శ్రీకాకుళంకు చెందిన రావి కొండలరావు పదవ తరగతి వరకే చదివి ఆ తర్వాత చెన్నైలో ఆనందవాణి తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారట. కమలాకర్ రామేశ్వర రావు, బి.ఎన్ రెడ్డి వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారట రావి కొండరల రావు.            


అప్పటికే నటన మీద ఆసక్తి ఉన్నా కాని పెద్దగా ప్రయత్నించలేదని అన్నారు. ముళ్లపూడి రమణగారు తనలోని నటుడు ఉన్నాడని గుర్తించారు. ఆయన రిఫరెన్స్ తోనే ప్రేమించి చూడు సినిమాలో నటించాను. అందులో అక్కినేనికి తండ్రి పాత్రలో నటించాల్సి ఉంది. దర్శకుడు పుల్లయ్య దగ్గరకు వెళ్లి తనని రమణ గారు పంపించారు.. నాగేశ్వర రావు తండ్రి పాత్ర వేస్తానని చెప్పేసరికి.. ఆయన వెంటనే గెటౌట్ ఫ్రం మై ఆఫీస్ అని అన్నారట. ఇంత చిన్నవాడికి నీకు తండ్రి వేషం ఇవ్వడానికి నా బుద్ధి లేదా.. రాసిన ముళ్లపూడి రమణకి బుద్ధిలేదా.. ఈ పాత్ర వేస్తానంటూ వచ్చిన నీకు బుద్ధిలేదా అంటూ కోప్పడ్డారట. అయితే ఆ తర్వాత రమణతో పాటుగా మిగతా యూనిట్ సభ్యులు చెప్పడం వల్ల ఆ పాత్రలో రావి కొండల రావు నటించారట.


నాటకాలు వేసే టైంలోనే రాధాకుమారితో పరిచయం ఏర్పడిందని. రమణ గారి మా ఇద్దరిని చూసి పెళ్లి చేసుకోండని అన్నారని. ఆయన చెప్పినట్టుగా ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నారు రావి కొండల రావు. ఇప్పటికి తన దగ్గర కథలు ఉన్నాయని అంటున్నారు కొండల రావు. 



మరింత సమాచారం తెలుసుకోండి: