ఒక యంగ్ డైరెక్టర్ కు తాను తీసే రెండవ సినిమా టాప్ హీరోతో సెట్ కావడం ఒక అదృష్టం అయితే ఆ మూవీ 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీగా మారడం ఏ యంగ్ డైరెక్టర్ కు అయినా ఊహించని అదృష్టం. అయితే ప్రభాస్ తోనే తాను సినిమా తీస్తాను అన్న తన పంతాన్ని నెగ్గించుకుని ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టి తన పై తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రవర్తిస్తున్న తీరు పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.

మొదట్లో ‘సాహో’ లాంటి భారీ సినిమా తీయగల శక్తి సుజిత్ కు ఉందా అంటూ కామెంట్స్ చేసిన చాలామంది నిర్మాతలు ‘సాహో’ ట్రైలర్ చూసిన తరువాత తమ అభిప్రాయం మార్చుకోవడమే కాకుండా ప్రస్తుతం ‘సాహో’ రిజల్ట్ తెలియకుండానే తమకు ఒక సినిమాను చేసి పెట్టమని అడుగుతున్నట్లు టాక్. అంతేకాదు సుజిత్ అడగకుండానే భారీ మొత్తాలను అడ్వాన్స్ లుగా ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు సుజిత్ పై ఒత్తిడి చేస్తున్నా ఒక్క రూపాయి కూడ సుజిత్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని వార్తలు వస్తున్నాయి.

దీనితో ఇలాంటి పోటీ వాతావరణంలో కూడ సుజిత్ ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి అంటూ ఇండస్ట్రీలో కొందరు ఆశ్చర్య పోతున్నారు. అయితే సుజిత్ ఇలా ప్రవర్తించడంతో మరికొందరు సుజిత్ పై ఉండే ఈర్ష్యతో జోక్స్ కూడ వేస్తున్నట్లు టాక్. అంతేకాదు సుజిత్ కు ‘సాహో’ రిజల్ట్ పై నమ్మకం లేదా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే సుజిత్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. ప్రస్తుతం సుజిత్ దృష్టి అంతా ‘సాహో’ పై ఉండటంతో ఈ యంగ్ డైరెక్టర్ తన దగ్గరకు వచ్చే ఏ నిర్మాతను పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో ‘సాహో’ విడుదల తరువాత మాట్లాడుకుందాం అని చెపుతున్నాడు కాని తనకు వస్తున్న అవకాశాలను గుర్తించలేక కాదు అంటూ సుజిత్ స్నేహితులు ఈ నెగిటివ్ వార్తల ప్రచారాన్ని ఖండిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: