నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ షో నుండి నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కు శివజ్యోతి, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, హిమజ, మహేశ్ విట్టా , పునర్నవి భూపాళం, అషు రెడ్డి నామినేట్ అయ్యారు. ఈ షోలో రాహుల్, పునర్నవి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి. రాహుల్ పులిహోర కలుపుతున్నాడని బిగ్ బాస్ షోకు గెస్ట్ గా వచ్చిన వెన్నెల కిషోర్ అన్నాడు. 
 
బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత తమన్నా సింహాద్రి రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య ఏదో ఉందనేలా వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా పునర్నవి రాహుల్ కు తినిపించటం, రాహుల్ పునర్నవితో డేటింగ్ గురించి మాట్లాడటం వలన రాహుల్, పునర్నవి మధ్య ఏదో ఉందని వార్తలు వినిపించాయి. రాహుల్, పునర్నవిపై వస్తున్న వార్తల గురించి ఈ వారం ఎలిమినేట్ అయిన రోహిణి క్లారిటీ ఇచ్చింది. 
 
రాహుల్, పునర్నవి కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వారిద్దరి మధ్య ఏమీ లేదని రోహిణి క్లారిటీ ఇచ్చింది. పునర్నవితో ఎందుకు అంత చనువుగా ఉన్నావని రాహుల్ ను అడిగానని తను ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడని రోహిణి చెప్పింది. రాహుల్ కావాలనే పునర్నవిని ఆట పట్టిస్తాడని అంతకు మించి వారిద్దరి మధ్య ఏమీ లేదని రోహిణి స్పష్టం చేసింది. రోహిణి చెప్పటంతో రాహుల్, పునర్నవి మధ్య ఏముందనే విషయం గురించి క్లారిటీ వచ్చింది. 
 
నిన్నటి ఎపిసోడ్లో ఇచ్చిన టాస్క్ లో శ్రీముఖి, బాబా భాస్కర్ డ్యాన్స్ మాస్టర్లుగా వ్యవహరించారు. పునర్నవి ఇస్మార్ట్ శంకర్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అషు రెడ్డి జిగేల్ రాణి పాటకు డ్యాన్స్ చేసింది. వితిక కళ్ళు డొనేట్ చేయమని మెసేజ్ ఇస్తూ యాక్ట్ చేస్తుంది. శివజ్యోతి మ్యాజిక్ అని చెప్పి అగ్గిపెట్టెలో చీర పట్టిస్తానని అగ్గిపెట్టె నుండి చీరను లాగుతుంది. హిమజ గురు సినిమాలోని పాట పాడుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: