శ్రీదేవి  అందం మరియు అభినయం ఉన్న తార. శ్రీదేవి దాదాపు 132 సినిమాల్లో నటించారు. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే మరణించారు.ఆమె మరణం అందరిని ఆశ్చర్యనికి గురిచేసింది.శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమె అలా బాత్‌టబ్‌లో పడి మరణించడం వెనుక మిస్టరీ ఏదో దాగి వుందనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతుంటాయి.అయితే ప్రజల్లో వున్న అనుమానాల ఆధారంగా 'శ్రీదేవి బంగ్లా' అనే చిత్రం ఒకటి రూపొందుతోంది. 
ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'శ్రీదేవి బంగ్లా' రూపోందితుంది.. ఈ సినిమా లో ప్రియా ఒక హీరోయిన్ గా నటింస్తుంది. ఈ సినిమా లో తన పేరు శ్రీదేవి.ఇక్కడి వరకు ఏలాంటి ఇబ్బంది లేదు కానీ టీజర్  చివరి షాట్‌ లో కాళ్ళు బాత్‌ టబ్‌లో నుండి బయటికి వస్తాయి. ఇది చూసిన ఏవరికైనా ఇది  శ్రీదేవి కథతోనే రూపొందుతోందని అర్థమవుతుంది.ఈ చిత్రానికి పేరు మార్చిన తరువాతనే విడుదల చేయలని శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ కోర్టులో కేసు వేసారు.
ఇలా మరొకరి చావుని క్యాష్‌ చేసుకోవాలనే చీప్‌ ప్రయత్నాలు ఎలా చేస్తారో అర్థం కావడం లేదని, ఇందులో నటించే వారికి, దీనికి పనిచేసే వారికి కనీస విలువలు కూడా లేవా అని బోనీ కపూర్‌ ప్రశ్నించారు. అయితే ఈ సినిమా డైరక్టర్ ప్రశాంత్ మీడియతో మాట్లాడుతు మాకు లాస్ట్ వీక్ బోనీ కపూర్ నుండి లీగల్ నోటిసులు వచ్చాయి. నేను బోనీ కపూర్ గారికి చెప్పాను, ఇది నటి శ్రీదేవి జీవితచరిత్ర కాదని. శ్రీదేవి ఒక సాదరణ పేరు అది ఎవరికైనా ఉండచ్చు అని చెప్పిన ఆయన వినలేదని.అందువల్ల మేము కూడా లీగల్ ప్రోసిడ్ అవుతున్నాము అని ఆయన చెప్పారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపోందుతుంది. ప్రియా ప్రకాష్‌ వారియర్‌  ఈ సినిమా శ్రీదేవి జీవితచరిత్ర కాదని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: