గత కొన్ని రోజుల నుంచి దేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, మహరాష్ట్ర,అస్సాం, హిమాచల్ ప్రదేశ్ లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. వేల సంఖ్యల్లో ఆస్తినష్టం..వందల సంఖ్యల్లో ప్రాణ నష్టం జరిగింది. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలం అయ్యింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండటం, రోడ్లు కొట్టుకుపోతుండటం వల్ల జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.   

వరదల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా,  ప్రముఖ మలయాళీ నటి మంజు వారియర్ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 30 మంది ఉన్న ఈ బృందం చట్రూ కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అవార్డు విన్నింగ్‌ దర్శకుడు సనల్‌ కుమార్‌ శశిధరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ నిమిత్తం వీరంతా హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లారు. వీరంతా చత్రు అనే ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోయారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందు చర్యలు చేపడుతోంది. కానీ నటి మంజు వారియర్ మాత్రం ప్రభుత్వ సహాయ చర్యలని నిరాకరించినట్లు తెలుస్తోంది.అయితే  మంజు వారియర్‌ సోదరుడు మధు మాట్లాడుతూ.. ‘సనల్‌ కుమార్‌, మంజు, ఇతర చిత్ర బృందం హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో చిక్కుకుపోయారు. దీన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.  సోమవారం రాత్రి నా సోదరి నాకు శాటిలైట్‌ ఫోన్‌ నుంచి కాల్‌ చేసింది. తామంతా క్షేమంగానే ఉన్నామని చెప్పింది.

కానీ సరిపడా ఆహారం లేదు. కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే ఆహారం ఉంది. తక్షణమే తమకు సాయం అందేలా చూడమని కోరింది. ఈ విషయాన్ని మంత్రి వి మురళీధరన్‌ దృష్టికి తీసుకెళ్లాను. అయితే  నటి మంజు వారియర్ మాత్రం ప్రభుత్వ సహాయ చర్యలని నిరాకరించినట్లు తెలుస్తోంది. చిత్ర బృందంతో ఆమె మనాలి వెళ్లాల్సి ఉంది.  ఆ రోడ్డు వరదతో దెబ్బతినడంతో వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. మరమ్మత్తులు జరిగాక తాము మనాలి వెళతామని ఎలాంటి సహాయ చర్యలు వద్దని మంజు వారియర్ అంటున్నారు.

తమకేదైనా ప్రమాదం జరిగితే అది ప్రభుత్వ బాధ్యత కాదని మంజు వారియర్ తెలిపింది.  అయితే మంజువారియర్ అలా అంటున్న ప్రభుత్వం తమ బాధ్యత తాము నిర్వహించాలంటున్నారు. ఈ నేపథ్యంలో  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రంగంలోకి దిగి వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: