ఇండియా వ్యాప్తంగా సాహో ఫీవర్ భీభత్సంగా పెరిగిపోయింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకతంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విడుదల కాబోతున్న అన్ని భాషల్లోనూ సాహో విడుదల కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీజర్, ట్రైలర్లకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సాహో సినిమా విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.


పోస్టర్ల నుంచి ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ మరియు బ్యాడ్ బాయ్ సాంగ్ వరకు ప్రతీ ఒక్క అంశం కూడా సాహో పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గించలేదు. అయితే ఆగస్టు ౩౦ న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అన్ని రికార్డులని చెరిపేసేదిగా ఉంటుందని అంటున్నారు. మరోసారి ప్రభాస్ బాహుబలి ద్వారా తాను నెలకొల్పిన రికార్డులను తానే బద్దలు కొట్టబోతున్నాడు.


అయితే దానికంటే ముందే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ విషయంలోనూ సాహో ముందుంది. మనదేశంలోనే కాదు, తెలుగు వారెక్కడుంటే అక్కడ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలో సాహో అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగుందట.ఆస్ట్రేలియా దేశంలో సాహో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయట. ఆస్ట్రేలియా లోని ప్రధాన నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాలలో ఈ జోరు ఇంకా బాగుందట. 


దీనితో బుకింగ్స్ ద్వారానే ఓ మంచి ఫిగర్ ని సాధించే అవకాశం కలదు. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కి జపాన్ లో ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జపనీస్ భాషలో సినిమా డబ్ అయితే అక్కడ మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: