తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ బిగిల్.  ఇటీవలే  విజయ్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. షూటింగ్ ను పూర్తి చేశాక సినిమా యూనిట్ కు  గోల్డ్ రింగ్ లను కూడా బహుమానం చేసిన విషయం తెలిసిందే.  ఇక విజయ్ ఇప్పటివరకు తన కెరీర్ లో అత్యధికంగా ఈ సినిమాకే తన కాల్షీట్ లను ఇచ్చారు.  ఈసినిమా కోసం  విజయ్  ఏకంగా 149రోజులు పనిచేశారట. అట్లీ డైరెక్షన్ లో  స్పోర్ట్స్  డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. 



భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక దీపావళి విజయ్ కి సెంటిమెంట్... ఆ సమయం లో విడుదలైన  తుపాకీ ,మెర్సల్ ,  సర్కార్  చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు ఈ బిగిల్ ను కూడా దీపావళి కానుకగా  థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్.  అక్టోబర్ 24న లేదా 25న  ఈ సినిమా విడుదలకానుంది.  




ఇప్పటికే విజయ్ -అట్లీ కాంబినేషన్ లో వచ్చిన  తెరి , మెర్సల్  సూపర్ హిట్లు కావడంతో బిగిల్ ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.  విజయ్ కి  ఉన్న భారీ  ఫ్యాన్ ఫాలోయింగ్ తో మొదటి రోజు ఈ సినిమా  కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరిగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.  అలాగే  పెద్ద సినిమా ల్లో ఈ ఏడాది  కోలీవుడ్ లో విడుదలకానున్న చివరి   సినిమా కూడా  ఇదే.  ఇక గత ఏడాది సర్కార్ తెలుగులో కూడా విడుదలై  సూపర్ కలెక్షన్స్ రాబట్టడంతో  బిగిల్ తెలుగు థియేట్రికల్  రైట్స్ కోసం  ఫుల్ డిమాండ్  ఏర్పడింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: