నాచురల్ స్టార్ నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు లిరికల్ సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించడం జరిగింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, 

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, గ్యాంగ్ లీడర్ మూవీ టీమ్, ఆయనకు ఒకింత వెరైటీగా విషెస్ తెల్పడం జరిగింది. గతంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో, ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో టింకరింగ్ ఫైర్ పైప్ పట్టుకుని ఉన్న స్టిల్ మాదిరిగా, నేటి  తమ గ్యాంగ్ లీడర్ మూవీలో హీరో అయిన నాని కూడా అచ్చంగా అదేవిధమైన స్టిల్ తో దిగిన ఫోటోను తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ యూనిట్. 

'ఇది మేము మెగాస్టార్ చిరంజీవి గారికి, మా మూవీ యూనిట్ తరపున ఇస్తున్న ట్రిబ్యూట్, ఆయనే అసలైన గ్యాంగ్ లీడర్, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నాం' అంటూ హీరో నాని, తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్ ని పోస్ట్ చేస్తూ తెల్పడం జరిగింది. ఇక నాని చేసిన ఆ పోస్ట్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, మెగాఫ్యాన్స్ ఆ పోస్ట్ పై అమితానందాన్ని వ్యక్తం చేస్తూ, నానికి మరియు మైత్రి మూవీ మేకర్స్ యూనిట్ కి కృతజ్ఞతలు తెల్పుతూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: