టాలీవుడ్ సంచలన స్టార్ ఎవరు అంటే సంపూర్ణేష్ బాబు అంటారు. హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు.  అంతకు ముందు ఈ హీరో ఓ యూట్యూబ్ వీడియోతో పాపులర్ అయ్యాడు.  యూట్యూబ్ లో చేసిన చిన్న షార్ట్ మూవీని రాజమౌళి మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో రాత్రికి రాత్రే సంపూ పాపులర్ అయ్యాడు.  హృదయకాలేయం సినిమా మంచి సాధించింది.  ఈ సినిమా హిట్ కొట్టిన తరువాత కొన్ని సినిమాలు చేశారు.  


కానీ పెద్దగా హిట్ కాలేదు.  దీంతో మరలా హృదయ కాలేయం సినిమా దర్శకుడిగా చేసిన రోనాల్డ్ సన్ ఈసారి ఓ భారీ కథను రెడీ చేసి కొబ్బరిమట్టగా సినిమాను తెరకెక్కించారు. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమా ఎట్టకేలకు జులై ఆగష్టు 10 వ తేదీన రిలీజ్ చేశారు.  అనూహ్యంగా స్పందన వచ్చింది. సంపూ సినిమాల్లో భారీ హిట్.  రిలీజైన వారంలోనే 12 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  సినిమాకు మంచి స్పందన రావడంతో.. విజయాత్రను నిర్వహించి.. మరింత వసూళ్లు సాధించారు.  


కొబ్బరి మట్ట యూనిట్ తో మరో సినిమా చేసేందుకు సంపూ సిద్ధం అయ్యాడు.  ఆ సినిమా ఏంటి ఎప్పుడు వస్తుంది. ఏ జానర్లో సినిమా చేయబోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయట.  ఒకవైపు సంపూర్ణేష్ బాబు సినిమాలు చేస్తూనే.. తనకు తోచిన సహాయాన్ని చేస్తుంటాడు.  ఇటీవలే కేరళ వరదలకు తన వంతు సహాయంగా దాదాపు రెండు లక్షల రూపాయలు సహాయం అందించాడు.  


సంపూ కు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది అభిమానులు కూడా ఉన్నారు.  కేవలం హీరోగా మాత్రమే కాకూండా మంచి పాత్ర దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేందుకు కూడా సంపూ సిద్ధంగా ఉన్నాడు.  సంపూ సినిమాలకు సినిమాలకు సోషల్ మీడియా నుంచి కూడా మంచి సపోర్ట్ దొరుకుంటుండటం విశేషం.  సంపూర్ణేష్ బాబు లాంటి హీరోలకు మంచి కథలు దొరకాలని, మంచి సినిమాలు చేయాలనీ మనమందరం కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: