మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా" నరసింహారెడ్డి. మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రంపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ ౨ వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ని మొన్న ముంబయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. పవర్ ఫుల్ వాయిస్ తో నరసింహారెడ్డి గురించి చెప్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి.


అయితే టీజర్‌లో ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి గురించి చెబుతూ చరిత్ర మరిచిన వీరుడు.. ఆంగ్లేయులను గడగడలాడించిన తెలుగు యోధుడు.. రేనాటి వీరుడు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను, అభిమానులను, నెటిజన్లను ఉద్వేగానికి గురిచేశాయి. టీజర్ ఎండింగ్ లో సైరా నరసింహారెడ్డి అని పలికే మాట అందరికీ పూనకాన్ని తెచ్చింది. అయితే రేనాటి వీరుడు అంటే ఏమిటనే ప్రశ్న అందర్నీ వెంటాడింది. 


ఈ క్రమంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన చిరంజీవి జన్మదినోత్సవంలో పవన్ కల్యాణ్ ఆ సందేహాన్ని తీర్చారు.ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిని రేనాటి వీరుడు అంటారు. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కర్నూలుకు సంబంధించిన రేనాటి ప్రాంతానికి చెందిన వీరుడు. నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటారు. నదీ పరీవాహక ప్రాంతంలో నివసించేవాడు కాబట్టి నరసింహారెడ్డిని రేనాటి సూర్యుడు అంటారని అన్నాడు.


అలాంటి రేనాటి పదాన్ని పలికే అదృష్టం సైరా నర్సింహరెడ్డి సినిమా నాకు ఇచ్చింది అని పవన్ కల్యాణ్ అన్నారు. సైరా చిత్రంలో నాకు స్ఫూర్తి ప్రధాతలుగా భావించే అమితాబ్ బచ్చన్, చిరంజీవి నటించారు. అలాంటి సినిమాలో వాయిస్ ఓవర్ ద్వారా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అని పవన్ చెప్పారు. ఈ సినిమాలో జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నయనతార నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: