నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. మరియు బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి 'రామాయణ' అనే హిస్టారికల్ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్ , అటు కోలీవుడ్ నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, సంప్రదింపులు కూడా జరిపారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అల్లు అరవింద్ ప్రధాన నిర్మాత కాబట్టి మెగా కాంపౌండ్ హీరోలు ఎవరైనా సినిమాలో ఉంటారా అనే కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ భారీ సినిమాలో ప్రభాస్ ను రాముడిగా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మెగా కాంపౌండ్లో కూడా పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న నటులున్నారు. పైగా రామాయణం అంటే బోలెడన్ని పాత్రలుంటాయి. వాటికి ఎక్కువమంది నటులే అవసరమవుతారు. కాబట్టి మెగా హీరోలు కూడా కొందరు సినిమాలో నటించవచ్చేమో చూడాలి. కానీ ప్రభాస్ రాముడు అయితే ఇక రావణ పరిస్థితి ఏమిటి ?
రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడు పాత్రను ఎవరు పోషించనున్నారో గాని, రాముడిగా ప్రభాస్ నటిస్తే.. రావణుడు పాత్రను పోషించే నటుడికి కూడా ప్రభాస్ స్థాయి ఆహార్యం ఉండాలి. లేదా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే నటుడు అయి ఉండాలి. ఇక రావణుడి పాత్రకి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చెయ్యాలని ఇప్పటికే చాల కామెంట్లు పెడుతున్నారు. ఎలాగూ పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న హీరోలు తక్కువుగా ఉన్నారు. అందుకే తారక్ పైనే అందరి చూపులు ఉన్నాయి. నిజంగా ఈ జనరేషన్ లో ఇలాంటి హిస్టారికల్ పాత్రలు చెయ్యటానికి గల సామర్ధ్యం ఒక్క ఎన్టీఆర్ లానే ఎక్కువుగా కనిపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు.