ప్రస్తుతం దేశమంతా సాహో ఫీవర్ తో ఊగిపోతోంది. భారీ వ్యయం, ప్రొడక్షన్ వాల్యూస్, క్యాస్టింగ్.. అంతకుమించి భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. సాహో మేనియాకు దేశంలో రికార్డు స్థాయిలో ధియేటర్లు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం తమిళనాడులో సాహో రికార్డు స్థాయిలో రిలీజవుతోంది. తమిళ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.



తమిళనాడులో ఈ సినిమాకు ఇప్పటికే 545 రెడీ చేసారని వార్తలు వస్తున్నాయి. బాహుబలి 2 కంటే ఈ ధియేటర్ల సంఖ్య 35 ఎక్కువ. రిలీజ్ టైమ్ కు మరో 25 ధియేటర్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఆగష్టు 30న తెల్లవారుజామున 3 గంటల నుండే చెన్నైలో బెనిఫిట్ షోలు వేయడానికి అక్కడి ప్రభుత్వ పర్మిషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా కూడా తమిళనాడులో ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా తమిళ డబ్బింగ్ వెర్షన్ లో అంతంతమాత్రంగానే రిలీజ్ అవుతాయి. కానీ సాహో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అంతటి భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది సాహో. ఇప్పటికే కొన్ని ధియేటర్లు సాహో కోసం టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటున్నాయి.

 

 

ఈ సినిమాను దాదాపు తమిళ్ మాతృకలానే తీసారని కాబట్టి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది యూనిట్ మాట. కాబట్టి సాహోకు టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా బాహుబలి రికార్డులు దాటేయడం ఖాయమని సినీ పండితులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ కి తమిళ్ లో పెద్దగా పోటీ లేదు. కాబట్టి.. సాహో ఏ రేంజ్ లో సునామీ సృష్టిస్తుందో చూడాలంటే మరో వారం ఆగాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: