మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతుంది సాహో సినిమా. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలున్నాయి. 350 కోట్ల రుపాయల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. భారతదేశంలో ఏడు వేల థియేటర్లకు పైగా ఈ సినిమా విడుదల కాబోతుంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా సెన్సార్ వ్యవహారాలు పూర్తి చేసుకుంది. 
 
2 గంటల 52 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదల కాబోతుంది. సాహో సెన్సార్ వ్యవహారాలు పూర్తయ్యాక ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సాహో సినిమా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందని సెకండాఫ్ మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమా అద్భుతంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సాహో సినిమా అద్భుతంగా ఉందని కానీ సెన్సార్ వర్గాలకు సాహో టీమ్ సెన్సార్ టాక్ లీక్ చేయవద్దని చెప్పిందని కూడా వార్తలు వస్తున్నాయి. సెన్సార్ టాక్ వార్తలు వేరు వేరుగా ఉండటంతో ప్రేక్షకులు అయోమయానికి గురవుతున్నారు. 
 
కానీ సాహో సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ మాత్రమే వినిపిస్తుంది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా కలెక్షన్లను బట్టి ప్రభాస్ మార్కెట్ మీద కూడా ఒక అంచనాకు రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 293 కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన సాహో సినిమాకు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా 170 కోట్ల రుపాయలు వచ్చినట్లు సమాచారం. 
 
2013 సంవత్సరంలో మిర్చి సినిమా రిలీజైన తరువాత ఆరు సంవత్సరాల్లో ప్రభాస్ కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించాడు. బాహుబలి, బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్లు కాగా సాహో ఫలితం మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. కెరీర్లో సినిమా సినిమాకు రెండు సంవత్సరాల గ్యాప్ వస్తూ ఉండటంతో ప్రభాస్ ఇకనుండి భారీ సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఇకముందు కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటానని ఇంటర్వ్యూలలో చెప్పాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: