పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బెంగుళూరు బ్యూటీ అనుష్క.  యోగా టీచర్ గా పనిచేస్తున్న అనుష్క అనూహ్యంగా సినీరంగ ప్రవేశం చేయడం..స్టార్ హీరోల సరిజోడిగా నటించడం ఈమెకు బాగా కలిసి వచ్చింది. కొత్తలో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో మురిపించిన అనుష్క తర్వాత కాలంలో ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం..లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. ఇలా జాతీయ స్థాయిలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. 


తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అనుష్క నెంబర్ వన్ రేస్ లో ఉంది. బాహుబలి తర్వాత భాగమతి సినిమాలో నటించిన అనుష్క ప్రస్తుతం ‘సైలెంట్’ సినిమాలో నటిస్తుంది.  ఇక టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘సైరా’ మూవీ ప్రమోషన్ బిజీలో చిత్ర యూనిట్ ఉన్నారు.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత, హీరో రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘సైరా’లో అనుష్క పాత్రపై క్లారిటీ ఇచ్చారు.  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇక అందాల తార నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి..కానీ దీనిపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్, లుక్ కానీ బయటకు రాలేదు. దాంతో ఇది నిజమా లేక రూమర్లా అని అభిమానులు సందిగ్ధంలో ఉన్నారు.  తాజాగా అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ..చిరంజీవి, రాంచరణ్ ‘సైరా’లో అనుష్క పాత్రపై వివరణ ఇచ్చారు.


రాంచరణ్ మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీ బాయి, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఇద్దరూ పదేళ్ల వ్యత్యాసంతో మరణించారు. ఇక సిపాయి తిరుగు బాటుకు ముందు ఝాన్సీ కి స్ఫూర్తిగా నిలిచింది నరసింహారెడ్డి అన్నారు.  ఇక చిరంజీవి మాట్లాడుతూ..ఈ మూవీలో లక్ష్మీబాయి పాత్రలో అనుష్క నటిస్తోందని వివరించాడు. అనుష్క పాత్ర ద్వారానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర మూవీలో పరిచయం అవుతుందని మెగాస్టార్  అన్నారు. అనుష్క పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెగాస్టార్ పాత్రని పరిచయం చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: