కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.  కన్నడం, హిందీ, తెలుగు, త‌మిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది.  అందుకే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి.  మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. కానీ ఇదే సందర్భంలో ఎన్నో అంచనాలను మూటగట్టుకున్న ఈ చిత్రం “బాహుబలి 2″  రికార్డులను రాబోతున్న సాహో, సైరా చిత్రాలు నెలకొల్పే రికార్డులను  సైతం కొట్టేస్తుందని కొంత మంది అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే నిజంగా కేజీఎఫ్ సినిమాకు అంత సీనుందా అంటే అంచనాలు పెట్టుకొవడంలో తప్పు లేదు కానీ  వాస్తవంగా అయితే ఈ సినిమాకు అంత సీన్ లేదనే చెప్పాలి.  


ఫస్ట్ పార్ట్ ను మాస్ క్లాసిక్ గా విడుదల చేస్తేనే..  అది కాస్తా కల్ట్ క్లాసిక్ గా మరి కాసుల వర్షాన్ని కురిపించింది.  మొదటి పార్ట్  ఓవరాల్ గా దాదాపు 200 కోట్లు రాబట్టింది. కానీ ఇక్కడ బాహుబలి మొదటి భాగమే దాదాపు 700 కోట్ల మేర రాబట్టేసింది. ఇప్పుడు సైరా అండ్ సాహో చిత్రాలు కూడా వందల కోట్లు రాబడతాయి.  కానీ కొంతమంది అభిమానులు ఏకంగా బాహుబలి 2, సైరా, సాహో   రికార్డులనే బద్దలు కొట్టేస్తుంది అంటే ఎవ్వరైనా నమ్ముతారా..? యష్ అభిమానులు మరీ  అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది.  ప్ర‌స్తుతం  కర్నాటక- భళ్లారిలో షెడ్యూల్ తో మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు.  ఇక  కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: