సినిమా ఇండస్ట్రీలో బాంబ్ షెల్ అనదగ్గ హీరోయిన్ నికిషా పటేల్ అంటే ఆశ్చర్యం లేదు. మొదటి సినిమానే తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన కొమరం పులి సినిమాలో నటించింది. ఎన్నో ఆశలతో ఆ సినిమా చేసిన ఈ అమ్మడు తొలి చిత్రమే డిజాస్టర్ రిజల్ట్ రావడంతో అవకాశాలు అందలేదు. దాంతో టాలీవుడ్ లో సెటిల్ అవుదామనుకున్న ఈ భామకు ఆ ఆశ అందని ద్రాక్షే అయింది. సక్కెస్ కు, సెంటిమెంట్ కు పెద్దపీట వేసే ఇండస్ట్రీలో అమ్మడి ఆశలు అడియాశలే అయ్యాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు టర్కీలో ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో బికినీ ఫోజులిచ్చిన తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ బికీలో తన నాజూకు అందాలతో అలరిస్తోంది. ముప్పైకి దగ్గర పడుతున్నా తన స్లిమ్ బాడీ ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటోంది. స్విమ్ సూట్స్ ఎక్కువగా తన ఫోటోలను అప్లోడ్ చేస్తూంటుంది. లండన్ లో పుట్టి పెరిగిన ఈ గుజరాతీ భామ 5 సార్లు మిస్ ఇండియా యూకే గా ఎంపికైంది. హిప్ హాప్ డ్యాన్స్ లో నిఖిషాకు మంచి ప్రావీణ్యముంది. అప్పుడప్పుడూ లండన్ లోని తన పేరెంట్స్ దగ్గరికి వెళ్తూంటుంది.

కొమరం పులి సినిమా తర్వాత అడపా దడపా తెలుగులో అవకాశాలు వచ్చినా అవేమీ ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. దీంతో వచ్చిన అవకాశాలు మాత్రం వినియోగించుకుని హీరోయిన్ పాత్రలు చేసింది. తెలుగులో కంటే నిఖిషా పటేల్ కు కన్నడలో ఎక్కువ సినిమాలు వచ్చాయనే చెప్పాలి. తమిళ, మళయాళ సినిమాల్లో కూడా నటించింది. క్రికెటర్ శ్రీశాంత్ తో నిఖిషా ఏడాది పాటు రిలేషన్ ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: