రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో, ఈనెల 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ ప్రోమోలకు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక సినిమాకు రిలీజ్ సమయం మరింత దగ్గర  పడుతుండడంతో, 

సాహో యూనిట్ తెలుగు సహా పలు ఇతర భాషల్లో సైతం ప్రమోషన్స్ ని స్పీడ్ గా పరిగెట్టిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ అన్ని భాషల మీడియా వారికి వరుసగా ఇంటర్వూస్ ఇస్తూ సాహోను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే సాహోకు హిందీలో కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరుగడం, అదీకాక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఇందులో ప్రభాస్ సరసన నటిస్తుండడంతో, సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చేలా నిర్మాతలు మరింత పక్కాగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు పలు బాలీవుడ్ మీడియా ఛానల్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాస్, శ్రద్ధ జోడి ఏకంగా బాలీవుడ్ నాట మంచి ఫేమస్ షోలుగా దూసుకెళ్తున్న ది కపిల్ శర్మ షో, అలానే నాచ్ బాలియే షోల్లో సందడి చేయడం జరిగింది. ఇక ఆ రెండు కార్యక్రమాలకు సంబందించిన ప్రోమోలు ఇప్పటికే టెలివిజన్ లోను అలానే యూట్యూబ్ లోను దూసుకుపోతున్నాయి. 

కాగా అందులో ముందుగా శనివారం నాచ్ బాలియే షో ప్రసారం అవుతుండగా, కపిల్ శర్మ షో నేడు ఆదివారం ప్రసారం కానుంది. ఇక రెండు షోల్లో జడ్జస్ మరియు పార్టిసిపేంట్స్ తో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేసిన సాహో జంట, ఆ  విధమైన ప్రమోషన్ తప్పకుండా తమ సినిమాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. మరి ప్రస్తుతం రోజురోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుకుంటూ పోతున్న సాహో, రేపు రిలీజ్ తరువాత ఎంతమేరకు సక్సెస్ సాదించి, ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరొక్క ఐదు రోజులు ఓపికపట్టాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: