జులై 21 వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ షోపై తెలుగు ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. బిగ్ బాస్ 3 లాంఛింగ్ ఎపిసోడ్ రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్స్ అందుకొంది. మొదటి వారంతో పోలిస్తే బిగ్ బాస్ షో రేటింగ్స్ తగ్గుతున్నప్పటికీ బిగ్ బాస్ షో కొత్త కొత్త టాస్కులతో, చిన్న చిన్న వివాదాలతో ఆసక్తికరంగానే సాగుతోంది. బిగ్ బాస్ షోలో ఇప్పటికే నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. 
 
మొదటివారం హేమ ఈ షో నుండి ఎలిమినేట్ కాగా రెండో వారం జాఫర్ ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కాగా గత వారం రోహిణి ఈ షో నుండి ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు నామినేట్ అయ్యారు. బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, శివ జ్యోతి, హిమజ, పునర్నవి భూపాళం, మహేశ్ విట్టా, అషు రెడ్డి ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. 
 
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం బిగ్ బాస్ షో నుండి అషు రెడ్డి ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందుగానే వార్తలు వినిపించాయి. అషు రెడ్డి బిగ్ బాస్ షోలో కాంట్రవర్సీలకు దూరంగానే ఉన్నప్పటికీ టాస్కుల విషయంలో అషు రెడ్డి పెద్దగా ఆసక్తి చూపించకపోవటం అషు రెడ్డికి నెగటివ్ గా మారింది. 
 
బిగ్ బాస్ షోలో అషు రెడ్డి కాకుండా మిగతా ఇంటిసభ్యులకు సినిమాలు, సీరియల్స్, టీవీ షోల ద్వారా గుర్తింపు ఉంది. డబ్ స్మాష్ స్టార్ గా పాపులర్ అయిన అషు రెడ్డికి అంత గుర్తింపు లేకపోవటం కూడా మైనస్ గా మారిందని తెలుస్తుంది. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో బాబా భాస్కర్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం అందుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: