‘సాహో’ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈ మూవీని వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో విడుదలచేసి అదేవిధంగా ఓవర్సీస్ లో అత్యధిక స్థాయిలో ప్రీమియర్ షోలో వేసి ఈ మూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ తీసుకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  ‘బాహుబలి 2’ మొదటిరోజు 120 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది కాబట్టి ‘సాహో’ కు కనీసం 125 కోట్ల ఓపెనింగ్ కలక్షన్స్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి ఒక ఊహించని తలనొప్పి ఎదురైందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు సంబంధించి వచ్చే ఓవర్సీస్ టాక్ అత్యంత కీలకంగా మారింది. ఇండియాలో సినిమాలకు సంబంధించి మొదటిరోజు మొదటి షో ప్రారంభం అయ్యే సమయానికే ఓవర్సీస్ టాక్ బయటకు వచ్చేస్తుంది. ఆ ఓవర్సీస్ టాక్ లో తేడాలు వినిపిస్తే ఇండియాలో టాప్ హీరోల సినిమాల టాక్ పై విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతోంది. 

ఇలాంటి పరిస్థితులలో మీడియా సంస్థలు  ప్రచారంలోకి తీసుకు వచ్చే మూవీ సెన్సార్ టాక్ ప్రీరిలీజ్ టాక్ ఓవర్సీస్ టాక్ లు అత్యంత కీలకంగా మారాయి. దీనితో బాలీవుడ్ మీడియాకు చెందిన అనేక ప్రముఖ మీడియా సంస్థలు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రచారం చేసే మూవీ ట్విటర్ రివ్యూ ఫస్ట్ షో టాక్ లు చాల కీలకంగా మారడంతో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి అనేక మీడియా సంస్థలు పాజిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి ఆ సినిమా నిర్మాతల నుండి భారీ మొత్తాలు తీసుకోవడం బాలీవుడ్ లో ఒక సాంప్రదాయంగా మారిపోయింది. 

ఈ విషయానికి సంబంధించి బాలీవుడ్ మీడియా సంస్థల ఆశలు మితిమీరి ఉండటంతో ‘సాహో’ నిర్మాతలు షేక్ అవుతున్నట్లు టాక్. ‘సాహో’  ఓవర్సీస్ వ్యవహారాలు అన్నీ యష్ రాజ్ ఫిలిమ్స్ చూసుకుంటోంది. అయితే వీరు ప్రచారానికి సంబంధించి మీడియాకు డబ్బు ఇచ్చే విషయంలో చాల పొదుపుగా ఉంటారని టాక్. దీనితో ‘సాహో’ కోసం తాము కోరుకున్న స్థాయిలో భారీ మొత్తాలు ఇవ్వకపోతే ఈమూవీ పై ట్విట్ రివ్యూల పేరుతో నెగిటివ్ ప్రచారాన్ని చేస్తాము అని భయపెడుతున్న కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక ‘సాహో’ నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: