బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు.  ఎన్నో లవ్ స్టోరీస్ సినిమాలు చేశారు.  తన కెరీర్లో రెండు సినిమాలు మాత్రం చాలా యూనిక్ గా ఉంటాయి.  చాలా కొత్తగా కూడా ఉంటాయి.  ఆ రెండు సినిమాల్లో ఒకటి దిల్వాలే దుల్హనియా లేజాయేంగే కాగా రెండో సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్.  రెండు కథలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.  కాకపోతే, అవి జరిగే ప్రాంతాలు వేరు.  అంతేతేడా.  


దిల్వాలే సినిమా యూరప్ లో జరుగుతుంది.  యూరప్ లో ట్రిప్ కు వెళ్లేసమయంలో షారుక్ ఖాన్ హీరోయిన్ కాజోల్ కు చేయి అందించి ట్రైన్ లోకి లాగుతాడు.  అక్కడి వారి ప్రయాణం మొదలౌతుంది.  ఆ ప్రయాణంలో ఎన్నో మలుపులు.. మరెన్నో ప్రేమలు.. వారి ప్రేమను దక్కించుకోవడానికి షారుక్ ఇండియా వస్తాడు.  అక్కడ ఆమెను ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.  చాలా అద్భుతంగా ఉంటుంది.  బాలీవుడ్లోనే కాదు.. ఈ సినిమా టాలీవుడ్ లోను మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  తెలుగులో ఎక్కువ రోజులు ఆడిన షారుక్ సినిమా ఇదే.  


ఈ సినిమా చాలా కాలం ఆరువాత వచ్చిన సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్.  ఇందులో కూడా షారుక్.. దీపికాల ప్రేమ ట్రైన్ లోనే మొదలౌతుంది.  అలా ట్రైన్ లో మొదలైన వారి ప్రేమ వివాహం వైపుకు దారితీస్తుంది.  అనుకోకుండా జరిగిన వారి పెళ్లి విషయాన్ని నిజం చేయడానికి షారుక్, దీపికాలు పడిన కష్టం అంతాఇంతా కాదు.  చెన్నై ఎక్స్ ప్రెస్ లో వాళ్ళు వెళ్లడం.. అక్కడ దీపికా వాళ్ళ తల్లిదండ్రులను కలవడం.. అక్కడ జరిగిన హంగామా అంతాఇంతా కాదు.  


దీనిని తెరపై చిత్రీకరించిన విధానం బాగుంది.  లవ్ కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని రకాలు పర్ఫెక్ట్ గా వర్కౌట్ కావడంతో సినిమా మంచి విజయం సాధించింది.  తన సినిమాల్లో ట్రైన్ సీన్స్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయని, ఏదో ఒక సీన్లో ట్రైన్ సన్నివేశం వస్తుందని.. ఎన్నో రైల్వే స్టేషన్స్ చూశానని, బాద్రా స్టేషన్ చూడలేకపోయాయని అన్నాడు షారుక్.  నిన్న షారుక్ బాద్రా స్టేషన్ కు వెళ్లారు. అక్కడ స్టేషన్లో కొత్త పోస్టల్ కవర్ ను ప్రారంభించారు.  బాద్రా స్టేషన్ ను చూశాను కాబట్టి.. ఇకపై అక్కడ కూడా తన ప్రేమకథలు మొదలౌతాయని అన్నారు షారుక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: