మాస్ రాజా రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డిస్కోరాజా'. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఇక ఈసినిమాలో రవితేజ కొత్త లుక్ ఇదే నంటూ నిన్న సోషల్ మీడియా లో ఓ పిక్ హల్ చల్ చేసింది. ఇక ఆ ఫోటో ను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ పిక్ లో రవితేజ ను పోలిన వున్న ఓ యువకుడు కనిపించడంతో ఆశ్ఛర్య పోయారు. అయితే అభిమానులను కూడా ఆ లుక్ అయోమయానికి గురి చేసింది. చాలా మంది ఆ ఫోటో లో వుంది రవితేజ నేనా అనే అనుమానం వ్యక్తంచేశారు. గంటల వ్యవధిలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే అసలు ఆ ఫోటో కు రవితేజ కు ఎలాంటి సంబంధం లేదు.
ఈవిషయం ఫై తాజాగా డైరెక్టర్ వి ఐ ఆనంద్ సామజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ... ఆన్ లైన్ లో సర్క్యూలేట్ అవుతున్న రవితేజ పిక్ నిజం కాదు. ఈ ఫొటో ను ప్రమోట్ చేయడం లో డిస్కోరాజా టీం ఎవరు లేరు. రవితేజ అసలైన మేక్ ఓవర్ అదికాదు త్వరలోనే డిస్కోరాజా నుండి రవితేజ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. దాంతో నిన్న వైరల్ అయిన ఆ పిక్ రవితేజది కాదని తేలిపోయింది.
సైన్టిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా తమిళ నటుడు బాబీ సింహ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.