తెలుగు సినిమాల్లో ప్రస్తుతం వెర్సటైల్ ఆర్టిస్ట్ ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తోచ్చే పేరు నాని. ఈ హీరో చేసిన సినిమాలు ఎలాంటి క్లాసిక్స్ గా ఉంటాయో, చేస్తున్న సినిమాలపై క్యూరియాసిటీ అలానే ఉంటుంది. నానీ ఓ సినిమా ఒప్పుకున్నాడంటే అందులో ఏదొక కంటెంట్ ఉండే ఉంటుందనే నమ్మకాన్ని ఈ హీరో సంపాదించాడు. దీంతో నానీ సినిమాలు మినిమం గ్యారంటీగా ముద్రపడ్డాయి.



ప్రస్తుతం నానీ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వస్తున్న నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ సినిమా తెరకెక్కుతోంది. ఓ విభిన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని యూనిట్ అంటోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అష్టాచమ్మా, జెంటిల్ మెన్ సినిమాలు రెండూ సూపర్ హిట్లే. దాంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి. మరోవైపు ఓ కొత్త సినిమాను ఓకే చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ఓ సినిమాపై ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. నటుడి నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ ఇప్పటికి రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చిలసౌ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇటివల టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో తీసిన మన్మథుడు 2 సినిమా డిజాస్టర్ అయింది.



తాజా ఫలితంతో సంబంధం లేకుండా రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ నానీకి నచ్చిందని సమాచారం. దీనిని మరింత డెవలెప్ చేసి తీసుకొస్తే సినిమా చేయాలనే ఆలోచనలో నానీ ఉన్నట్టు సమాచారం. రాహుల్ తన సినిమాలో ఓవర్ డోస్ పెట్టకుండా కథానుసారం వెళితే ఫలితం చిలసౌ లా ఉంటుంది. మరి నానీ సినిమాతో ఏం చేస్తాడో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: