మామ తెరమీద  రొమాన్స్ చేస్తానంటే కోడలు నో అంటోందట. అసలే మామ గారు అలాంటి ఇలాంటి వారు కారు. ఆయన రొమాంటిక్ కింగ్. ఆయన వయసు పెరిగినా మనసు మాత్రం ఎప్పటికీ పాతికే. ఆయన అలా కన్ను గీటితే చాలు వారూ వీరూ కాకుండా అంతా సరెండర్ అయిపోతారు. ఓ విధంగా క్రిష్ణుడిగా కనిపించే మామకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. అటువంటి ఆయన్ని కట్టడి చేయడం సులభమా.


ఆ మామ ఎవరో కాదు అక్కినేని నాగార్జున. ఆయన తాజా సినిమా మన్మధుడు 2 ఈ మధ్యనే రిలీజ్ అయింది. షష్టి పూర్తి హీరో ఇందులో చేసిన రొమాన్స్ ఓ రేంజికి వెళ్ళింది. నాగ హ్యాండ్ సమ్  హీరో అన్నది మరో మారు ప్రూవ్ అయింది. అయితే సినిమాలో కధ పాతది కావడం, కధనం వీక్ కావడం వల్ల మూవీ రిజల్ట్ తేడా కొట్టింది. కానీ నాగ్ రొమాన్స్ కి మంచి మార్కులే పడ్డాయి


అయితే నాగ్ కోడలు సమంత మాత్రం మామగారు డిగ్నిఫైడ్ రోల్స్ ప్లే చేయాలని కోరుకుంటోందని టాలీవుడ్ టాక్. నాగ్ ఈ వయసులో అమ్మాయిల వెంట పరుగులు తీసే ప్లే బాయ్ లాంటి రోల్స్ వేయడం సమంతకు అసలు నచ్చడంలెదని టాక్. అందుకే ఆమె మన్మధుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాలేదని అంటున్నారు. అలాగే ప్రమోషన్లో కూడా పాల్గొనలేదుట.


ఇక నాగ్ మన్మధుడు ప్రమోషన్లో ఇదే విషయాన్ని చెబుతూ  సమంతకు నచ్చడంలేదని చెప్పేశారు. మరి నాగ్ అంటేనే రొమాంటిక్ కింగ్. ఆయన అలాంటి రోల్స్ చేస్తేనే చూస్తామనే వారు ఉన్నారు. ఇక బంగార్రాజు సీక్వెల్ లో కూడా నాగ పూర్తిగా రసికప్రియుడుగా నటించబోతున్నాడుట.


ఆ మూవీ విషయంలో కూడా సమంతకు అభ్యంతరాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య కూడా అలాంటి రోలే ప్లే చేస్తాడట. దాంతో సమంత కొత్త కండిషన్లు పెడుతోందని టాక్. మరి నాగ్ రొమాంటిక్ పాత్రలు వేయకూడదా. కోడలు ఏమంటోంది. దీని మీద బంగార్రాజు షూటింగ్ మొదలైతే కానీ క్లారిటీ రాదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: