సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ఈచిత్రానికి  ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు  సమాచారం.  ఇక ఈ చిత్రంలో  డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో బాక్సర్ గా కనిపించనున్నాడట  విజయ్. అందుకోసం  ప్రొఫెషనల్ బాక్సర్ల  సమక్షంలో విజయ్ ట్రైనింగ్ కూడా తీసుకోనున్నట్లు సమాచారం.   కాగా ప్రస్తుతం  విజయ్ , మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విజయ్ .. ఫైటర్ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు.  ఇక ఇటీవల డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకులముందుకు వచ్చిన  విజయ్  దేవరకొండకు ఆ సినిమా  గట్టి షాక్ ఇచ్చింది.  ఆసినిమా ఫలితం తో కొత్త డైరెక్టర్ లను దూరం పెడుతున్నాడట విజయ్. 





కాగా  వరుస పరాజయాలతో సతమతమైన  పూరి ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.  ఇటీవల విడుదలైన  ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  దాంతో పూరి వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ కు పూరి నిర్మాత కూడా కావడంతో  ఈ సినిమాతో భారీగానే  లాభాలను రాబట్టుకున్నాడు. పూరి మళ్ళీ ఫామ్ లోకి రావడంతో  ఈ ఫైటర్  సినిమా ఫై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక గతంలో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో  రవితేజ ను బాక్సర్ గా చూపించి  సూపర్ హిట్ కొట్టాడు పూరి. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కూడా  అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: