మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతుంది ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటించిన సాహో సినిమా. ఇప్పటికే ఈ సినిమాకు చాలా ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. హైదరాబాద్ లాంటి మేజర్ ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావటంతోపాటు వీకెండ్ వరకు టికెట్లు అన్నీ సేల్ అయినట్లు కనిపిస్తుంది. ఏపీలో సాహో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారని తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచటానికి అనుమతి రావటం లేదని తెలుస్తోంది. 
 
సాహో సినిమాలో ప్రభాస్ ఒక పాత్రలో కాదని రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఒక పాత్రలో ప్రభాస్ అండర్ కవర్ కాప్ గా కనిపిస్తుండగా మరో పాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. సాహో సినిమా ట్రైలర్ చూసినపుడు కూడా ప్రభాస్ హెయిర్ స్టైల్ గెటప్స్ వేరు వేరుగా ఉంటాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో సాహో సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. 
 
బాహుబలి 2 ఫస్ట్ డే 120 కోట్ల రుపాయల వరకు వసూలు చేయగా సాహో సినిమా బాహుబలి 2 రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. సాహో సినిమా విడుదలవుతున్నందుకు బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్లో పోటీగా ఉన్న సినిమాల రిలీజ్ డేట్స్ మారుస్తున్నారని సమాచారం. 
 
ఈ సినిమా తరువాత ప్రభాస్ యువి క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా జ్యోతిష్యం నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 25 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. సాహో సినిమా విడుదలైన రెండు వారాల తరువాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: