దక్షిణ భారతదేశం నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమా తర్వాత మళ్లీ అంతే క్రేజ్ రిలీజవుతున్న ఏకైక సినిమా సాహో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో పాటు వరల్డ్ వైడ్ గా రూ. 500 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి సీరిస్ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహో ఎలా ఉంటుందా ? అని ప్రతి ఒక్కరు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


సాహో థియేటర్ల‌ లోకి వచ్చేందుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 300-350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన `సాహో` వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 320 కోట్లకు అమ్మారు.. ఆ రేంజు షేర్ వసూలవ్వాలన్నది ఓ విశ్లేషణ. నాన్ థియేట్రికల్ కలుపుకుని బిజినెస్ రేంజ్ 450-500 కోట్ల మేర సాగుతోందని చెబుతున్నారు.


శుక్రవారం సాహో వరల్డ్‌వైడ్‌గా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ అటు బాలీవుడ్ లోనూ పెద్ద హీరోలు తమ సినిమాలను తపించేసి సాహో రిలీజ్ కు అవకాశం కల్పించారు. సినిమా యాక్షన్ కావడంతో ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా బాహుబలి 1 రికార్డులు బద్దలు అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలు ఎలా ? ఉన్నా ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ చేశారు. దీంతో సుజిత్ సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయి.


సాహో బాహుబలికి పోలిక పెట్టడం తప్పు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సాహో రిజల్ట్ ఎలా ?ఉంటుందా అని అటు మేక‌ర్స్‌లోనే కాకుండా ఇటు ఫ్యాన్స్‌లో కూడా తీవ్రమైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నెల 30న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు ఒక రోజు ముందుగానే ఆగస్టు 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు ప్రీమియర్ లకు అనుమ‌తులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రీమియర్ షోలు, సాహో రేట్లు పెంచుకునేందుకు ఇంకా అనుమ‌తులు రాలేదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: