బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు నుండి ఈ వారం అషు రెడ్డి ఎలిమినేట్ అయ్యింది. డబ్ స్మాష్ బ్యూటీగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అషు రెడ్డి. బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా వెళ్లింది. అయితే ఇన్నాళ్లు సేఫ్ జోన్ లో ఉంటూ వచ్చిన అషు రెడ్డి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. 


అయితే అందరిలాగా కాకుండా అషు రెడ్డి హౌజ్ లో ఉన్న ప్రతి కంటెస్టంట్ తో మంచి రిలేషన్ తో బయటకు వచ్చింది. అషు రెడ్డిని లాస్ట్ మండే వితిక, హిమజ నామినేట్ చేశారు. అయితే ఆమె ఎలిమినేట్ అవడం ఇంటి సభ్యులను షాక్ అయ్యేలా చేసింది. ఏడుగురు సభ్యులు ఈ వారం నామినేషన్ లో ఉండగా నిన్న శివ జ్యోతి, మహేష్ లను సేఫ్ చేశారు నాగార్జున.


ఇక ఈరోజు రాహుల్, పునర్నవి, బాబా భాస్కర్ లను సేఫ్ చేసి హిమజ, అషు రెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఫైనల్ గా అషు రెడ్డి ఇంటి నుండి బయటకు వచ్చింది. అయితే ఇంట్లో అందరి చేత మంచి అమ్మాయిగా అషు రెడ్డి మంచి పేరు తెచ్చుకుంది. కాకపోతే ఆటలో తనకంటూ ఓ సెపరేట్ ప్రణాళిక చేయకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ అయ్యిందని చెప్పొచ్చు. 


వారాలు గడుస్తున్నా కొద్ది నాగార్జున హోస్టింగ్ టాలెంట్ ఆకట్టుకుంటుంది. హోస్ట్ గా నాగ్ ఈ సీజన్ తన బాధ్యతను పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ చేసిన నాగార్జునకు బిగ్ బాస్ బిగ్ టాస్క్ లా అనిపించాడు. కాకపోతే ఇన్నేళ్ల తన ఎక్స్ పీరియెన్స్ తో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అషు రెడ్డి వెళ్తూ హౌజ్ లో స్టాంగ్ కంటెస్టంట్స్ గా ఏడుగురు సభ్యులను ఉంచడం హాట్ టాపిక్ అని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: