ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్శించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే జగన్ కోసం మన తెలుగు వారు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్‌సన్ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసి జగన్ అక్కడి తెలుగు వారిని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అన్నా .. అక్కా .. చెల్లెమ్మ అందరూ బాగున్నారా ? ఖండాలు దాటి మీరు చూపిస్తున్న ప్రేమను నేను ఎప్పటికి మరిచి పోనని, అమెరికాలో ఉన్నా మీరు మా నాన్న మీద , నా ఫ్యామిలీ మీద, నా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు ప్రేమాభివందనాలు చేస్తున్నాని జగన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. 


ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఇంత ఘాన విజయాన్ని .. 175 స్థానాల్లో 151 స్థానాలు .. 22 ఎంపీ స్థానాలు గెలిచిందంటే మీరు చేసిన కృషి ఎంతో ఉందని జగన్ చెప్పారు. చరిత్రలో కనీ వినీ ఎరుగని 50 శాతం ఓటు బ్యాంకు మన పార్టీకి వచ్చిందంటే మీరు చేసిన కృషి ఎంతో అద్భుతం అని జగన్ చెప్పుకొచ్చారు. ‘ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ యెక్క నినాదం తనకు స్ఫూర్తి అని .. అవినీతి లేని రాష్ట్రాన్ని తానూ రూపొందిస్తానని .. వ్యవసాయం చేసే ఏ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని .. ఏ సంక్షేమ పధకాన్ని అయినా లంచం లేకుండా ప్రతి పేదవాడికి అందాలన్నదే నా కల అని జగన్ భావోద్వేగంగా చెప్పారు. 


తన రెండు నెలల పాలనలో చరిత్రను మార్చే దిశగా అడుగులు వేశామని .. అమ్మవడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ , పేదోళ్లకు ఇల్లు వంటి పథకాలకు శ్రీకారం చుట్టామని, వచ్చే గాంధీ జయంతి నాటికీ గ్రామ సచివాలయాలును ఏర్పాటు చేస్తామని .. దేశంలో ఏపీ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా చేస్తానని చెప్పుకొచ్చారు. నామిటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్స్ .. పరిశ్రమల్లో స్థానికులుకు 75 శాతం ఉద్యోగాలు ఇవన్నీ ఏపీ భవిష్యత్ ను మార్చగలవు అని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: