కాశ్మీర్ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నదని, ప్రజలు రోడ్డుపైకి వచ్చి రగడ చేస్తున్నారని, కాశ్మీర్ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా భారత ప్రభుత్వం ఏకపక్షంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో నిర్ణయం తీసుకుందని గగ్గోలు పెడుతోంది పాకిస్తాన్.  ఇండియాను నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది.   వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోలేదు.  ఒక్క తుపాకీ గుండు కూడా పేలలేదు.  


జమ్మూ కాష్మర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో పాకిస్తాన్ కు నచ్చడంలేదు.  అందుకే పదేపదే బోర్డర్ లో కాల్పులకు పాల్పడుతున్నది.  పాకిస్తాన్ జరిపిన దాడుల్లో ఒక జవాన్ మరణించాడు.  దీనికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.  రాజౌరి సెక్టార్లోని పాకిస్తాన్ పోస్ట్ ను పేల్చివేసింది.  అంతకు ముందు జరిగిన ఎదురు కాల్పుల్లో పాక్ కు చెందిన ముగ్గురు సైనికులు మరణించారు.  


జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దాదాపుగా 144 సెక్షన్ ను ఎత్తివేసినట్టుగా కనిపిస్తోంది.  జమ్మూతో పాటు కాశ్మీర్ లో కూడా ఈ సెక్షన్ ను ఎత్తివేశారు.  అయితే, బారీకేడ్స్ మాత్రం కొన్ని రోజులు అలానే ఉంటాయి.  మరికొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ ఫోన్స్ ను అనుమతి ఇచ్చారు.  మొత్తం 20 టెలిఫోన్ ఎక్స్చేంచ్ లు ఉంటె 7 పనిచేస్తున్నాయి.  త్వరలోనే మిగతావి కూడా పనిచేస్తాయట.  అంతేకాదు, సెల్ ఫోన్ వ్యవస్థను కూడా పునరుద్ధరించారు.  


ప్రస్తుతం 2జీ వ్యవస్థ పనిచేస్తోంది.  పరిస్థితులను బట్టి 2జి, 4జీ సర్వీసులను కూడా పునరుద్దరించబోతున్నారు.  పార్లమెంట్ చట్టాలు అక్కడ ఇకపై అమలు జరుగుతాయి కాబట్టి, దేశానికీ వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు చేసినా, ఇండియా జెండాను అవమానించినా.. పాకిస్తాన్ జెండాను ఎగరవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.  పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నది కాబట్టి అక్కడి ప్రజలు, ప్రభుత్వం పోలీసులు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వచ్చింది.  సోమవారం నుంచి జమ్మూ కాశ్మీర్లో స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.  మరికొన్ని రోజుల్లో పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెప్తున్నారు.  జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.  తమను పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: