తస్లిమా నస్రీన్ గురించి తెలియని వ్యక్తి బహుశా ఉండకపోవచ్చు.  ఆమె ఎన్నో రచనలు చేశారు.  బాంగ్లాదేశ్ కు చెందిన మహిళా అయినప్పటికీ ఇండియాలో నివాసం ఉంటున్నారు.  ఇండియా తరపున తన వాయిస్ ను వినిపిస్తున్నారు. ఆమె రాసిన లజ్జా అనే నవల పేరు తెచ్చిపెట్టింది. అదే సమయంలో అనేక వివాదాలకు తెరతీసింది.  బాంగ్లాదేశ్ లో భారతీయులపై జరుగుతున్న అన్యాయాలను అందులో చూపించడమే ఆమె చేసిన నేరం.  దీంతో అక్కడ ఆమెకు సేఫ్ కాదని తెలుసుకొని ఇండియా వచ్చింది.  


ఇండియాలో ఆమె తాత్కాలిక వీసాపై ఉంటోంది.  ప్రస్తుతం ఆమెకు వీసా మరో ఏడాది పెంచారు.  ఇదిలా ఉంటె, ఆమె ఇండియాలోనే శాశ్వతంగా ఉండాలని అనుకుంటోంది.  అందుకోసం శాశ్వత పౌరసత్వం ఇవ్వాలని ఇప్పటికే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  ఇదిలా ఉంటె, కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దును ఆమె స్వాగతించింది.  సంపూర్ణ మద్దతును తెలిపింది.  ఆర్టికల్ రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు తప్పకుండా సంతోషిస్తారని చెప్పింది.  


దీంతో పాటు ఇస్లామిక్ చట్టాలను కూడా రద్దు చేయాలని ఆమె కోరింది.  ఉమ్మడి పౌరస్మృతి కల్పోయించే విషయంపై కూడా ప్రభుత్వం కృషి చేయాలనీ కోరింది.  72 సంవత్సరాలుగా కాశ్మీర్లోని అమాయక ప్రజలు నలిగిపోతున్నారని, వారందరికీ స్వేచ్చా వాయువులు లభించాయని పేర్కొన్నది. ప్రతి మనిషికి కావలసింది తిండి, నీడ, మంచి ఉద్యోగం.  ఈ మూడు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తప్పకుండా అందుతాయని ఆమె పేర్కొనడం విశేషం.  తస్లిమా చేసిన వ్యాఖ్యలను చూసి కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది.  కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తస్లిమా ఇండియాకు వచ్చింది.  


జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇప్పటికే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నది.  అక్కడి మీడియాను అణిచివేసి, జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను తెలియనివ్వడం లేదని పాక్ వాపోతున్నది.  భారత ప్రభుత్వం చెప్తున్న దానికి విరుద్ధంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని వాటిని ఇండియా బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది.  అయితే, కాశ్మీర్ లోయ ప్రస్తుతం ప్రశాంతగా ఉందని ఇండియా మరోసారి స్పష్టం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: